బాబుకు గల్లా ఫ్యామిలీ హ్యాండ్.. జంపింగ్ ఖాయమేనా?

-

ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి కాస్త విచిత్రంగా ఉందనే చెప్పాలి…ఆ పార్టీ కాస్త పుంజుకున్నట్లే కనిపిస్తుంది…మళ్ళీ వెంటనే కిందకు పడుతున్నట్లు ఉంటుంది. అసలు టోటల్ గా పార్టీ పరిస్తితి కన్ఫ్యూజన్ గా ఉందని చెప్పాలి. సరే ఎలా ఉన్నా సరే అధినేత చంద్రబాబు మాత్రం పార్టీ కోసం ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ఈ వయసులో కూడా పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే చంద్రబాబు మాత్రం కష్టపడుతున్నారు గాని, కింద ఉన్న నేతలు మాత్రం ఆ స్థాయిలో పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఏదో కొందరు మాత్రమే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంటే…మరికొందరు మొక్కుబడిగా పనిచేస్తున్నారు. ఇంకా కొందరు నేతలైతే పార్టీలో కనిపించడం లేదు. ఇలా పార్టీలో రకరకాల పరిస్తితులు ఉన్నాయి. ఇదే క్రమంలో కొందరు నేతలు పార్టీకి ప్లస్ అవుతుంటే, మరికొందరు మైనస్ అవుతున్నారు. అలాగే వైసీపీ నుంచి కొందరు టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే….మరికొందరు పరిస్తితులని బట్టి టీడీపీని వదిలేయడానికి చూస్తున్నారు.

టీడీపీ అధికారం కోల్పోయాక చాలామంది నేతలు వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. అయితే ఓ ఏడాది నుంచి పెద్దగా వలసలు నడవటం లేదు..వైసీపీలోకి ఏ టీడీపీ నాయకుడు వెళ్ళడం లేదు. ఇంకా రివర్స్ లో వైసీపీ నేతలే టీడీపీలోకి వచ్చే పరిస్తితి కనిపిస్తోంది. ఇక ఇలాంటి తరుణంలో టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చేలా సీనియర్ నాయకురాలు గల్లా అరుణకుమారి స్టేట్మెంట్ ఉంది.

గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన అరుణ…తర్వాత తన కుమారుడు జయదేవ్ తో కలిసి టీడీపీలోకి వచ్చేశారు. ఇక జయదేవ్ వరుసపెట్టి రెండు సార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు. అటు అరుణ 2014లో పోటీ చేసి ఓడిపోయి, తర్వాత పోటీకి దూరమయ్యారు. ఇక రాజకీయంగా టీడీపీలో ఉన్నారు. కానీ తాజాగా తను రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. సరే దూరమైతే దూరమయ్యారు…కానీ ఆమె ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..తన కుటుంబంలో ఉన్నవారు అనుచరులు ఏ పార్టీలో భవిష్యత్ ఉంటుందో, ఆ పార్టీలోకి వెళ్లొచ్చని అన్నారు. అంటే పరోక్షంగా టీడీపీని వదిలి వెళ్లొచ్చని చెప్పారని అర్ధం చేసుకోవచ్చు. ఇక అరుణ మాటలు చూస్తుంటే త్వరలోనే జయదేవ్ సైతం టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారని కథనాలు వస్తున్నాయి. చూడాలి మరి గల్లా ఫ్యామిలీ..బాబుకు హ్యాండ్ ఇస్తుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news