టీడీపీకి జీవీఎల్ షాక్..జగన్‌కు కలిసొచ్చేలా.!

-

ఏపీలో పొత్తుల అంశంపై ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు..చూస్తే టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది గాని..బీజేపీ చేసే రాజకీయం బట్టి చూస్తే పొత్తు ఉండదని అనిపిస్తుంది. అసలు పొత్తు ఉంటే అటు టీడీపీకైనా, ఇటు జనసేనాకైనా బెనిఫిట్..అలాగే వైసీపీకి నష్టం. పొత్తు లేకపోతే టీడీపీ-జనసేనలకు నష్టం వైసీపీకి లాభం. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు.

అయితే చంద్రబాబు-పవన్ గాని పొత్తు దిశగానే వెళుతున్నారు..ఇటీవల వారి కలయికతో పొత్తు ఖాయమని అర్ధమైంది. ఆ తర్వాత పవన్ మోదీతో భేటీ కావడంతో సీన్ మారింది. ఆ భేటీలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ తర్వాత పవన్ యథావిధిగా తన పని చేసుకుంటున్నారు..వైసీపీపై పోరాటాలు చేస్తున్నారు. ఇటు చంద్రబాబు సైతం తన పనిలో తాను ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం ఒకసారి వైసీపీని, ఒకసారి టీడీపీని టార్గెట్ చేస్తుంది. దీంతో బి‌జే‌పి వర్షన్ అర్ధం కావడం లేదు. పోనీ పవన్ ఏమన్నా బి‌జే‌పిని వదిలేస్తున్నారా? అంటే అది జరగడం లేదు.

తీరా ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు లాంటి వారు..పవన్‌తో కలిసి పోటీ చేస్తామని, ఆయన టీడీపీతో కలవరని అంటున్నారు. టీడీపీకి భవిష్యత్ లేదని, ఆ పార్టీ క్షీణించిందని, తామే అసలైన ప్రతిపక్షం అని, ప్రజలు మళ్ళీ పాత కుంపటి కోరుకోవడం లేదని అన్నారు. జి‌వి‌ఎల్ మాటల ప్రకారం చూస్తే..టీడీపీతో పవన్‌ని కలవకుండా చేయడమే బి‌జే‌పి లక్ష్యంగా కనిపిస్తోంది..తద్వారా ఓట్లు చీలిక తెచ్చి ఫైనల్ గా జగన్‌కు మేలు చేకూరేలా చేయాలని చూస్తున్నారని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి.

అయినా తాము సింగిల్ గా పోటీ చేస్తామని, వార్డ్ మెంబర్ గా గెలవలేని బి‌జే‌పి నేతలు టి‌డి‌పి గురించి మాట్లాడటం కామెడిగా ఉందని అంటున్నారు. ఇలా బి‌జే‌పి చేస్తున్న రాజకీయంతో పొత్తుల అంశం క్లారిటీ లేదు. పైగా చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్ళీ కేంద్రంలో బీజేపీకి ఇబ్బంది అవుతుందని, అదే జగన్ వస్తే చెప్పినట్లు వింటారని బి‌జే‌పి ప్లాన్ చేస్తుందని తమ్ముళ్ళు అంటున్నారు. మరి ఇందులో ఏది వాస్తవం అనేది ఎన్నికల సమయంలోనే తేలుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news