హుజూరాబాద్‌లో హరీష్ కొత్త ఎత్తులు.. ఛాన్స్ లేదా?

-

హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలవడానికి టి‌ఆర్‌ఎస్ పార్టీ చేయని కార్యక్రమం లేదు. అసలు ఒక ఉపఎన్నికకు ఇన్ని రకాల కార్యక్రమాలు చేయడం…రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక అధికార పార్టీ…ప్రత్యర్ధికి భయపడి…హుజూరాబాద్‌లో ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తుందో అంతా చూస్తూనే ఉన్నారు.

harishrao
harishrao

ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా ఈటల రాజేందర్‌ని దెబ్బతీయడానికి కే‌సి‌ఆర్ వేయని ఎత్తులు లేవు….చేయని కార్యక్రమం లేదు. అటు హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ గెలుపు బాధ్యతని తీసుకున్న మంత్రి హరీష్…ఎలాంటి వ్యూహాలతో ముందుకెళుతున్నారో కూడా అర్ధమవుతుంది. ఇప్పటివరకు అనేక ఎత్తులు వేస్తూ రాజకీయం చేస్తూ వచ్చిన హరీష్…తాజాగా మరో సరికొత్త ఎత్తుతో ముందుకొచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ తన సొంత బలాన్ని నమ్ముకుని ముందుకెళుతున్నారు. పేరుకు బి‌జే‌పి పార్టీ ఉన్నా సరే ఆ పార్టీ వల్ల ఈటలకు పెద్ద ఒరిగే ప్రయోజనం లేదు. కానీ బి‌జే‌పిలోని కొందరు కీలక నేతలు ఈటల గెలుపు కోసం కష్టపడుతున్నారు. జితేంద్ర రెడ్డి, వివేక్ లాంటి వారు… ఈటలకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. ఆ ఇద్దరు కూడా టి‌ఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారే. అయితే ఇందులో వివేక్‌ని తమ వైపుకు తిప్పుకునేందుకు హరీష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై వివేక్‌కు మంచి పట్టు ఉంది. అలాగే దళిత వర్గంలో కీలక నాయకుడుగా ఉన్నారు. అటు ఆర్ధికంగా కూడా ఈటలకు స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో వివేక్‌నే తమవైపు తిప్పేయాలని హరీష్ ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. అయితే టి‌ఆర్‌ఎస్‌లో అనేక అనుమానాలు అనుభవించి వచ్చిన వివేక్ మళ్ళీ అదే పార్టీ వైపుకు వెళ్ళడం కష్టమే…అసలు ఈటల బి‌జే‌పిలో చేరడంలో కీలక పాత్ర పోషించిందే వివేక్. అలాంటప్పుడు హరీష్ ఎత్తులు వర్కౌట్ అవ్వడం కష్టమే అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news