సీఎం జగన్ పాలనలో నష్టపోయింది రెడ్లేనా. . . . సీఎం చేతిలో రెడ్డి సామాజికవర్గం బాధితులుగా మారుతున్నారా. . . . సీఎం జగన్ సహా వైవీ సుబ్బారెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి మాత్రమే వైసీపీ ప్రభుత్వ పాలనలో బాగుపడ్డారా. . . కేవలం నలుగురు రెడ్లకు మాత్రమే కేబినెట్‌లో అవకాశం కల్పించడం వెనుక అర్ధం ఇదేనా… అవుననే అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత,మాజీమంత్రి నారా లోకేష్. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటూ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను వేధిస్తున్నాడనేది లోకేష్ ఆరోపణ.చిన్న కాంట్రాక్టర్లుగా ఉన్నవారిలో ఎక్కువ మంది రెడ్లే.విజిలెన్స్ దాడుల పేరుతో వారిని ఇబ్బంది పెట్టిన ఘనత సీఎం జగన్‌దేని ఆరోపించారు లోకేష్. అంతే కాదు టీడీపీ అధికారంలోకి వస్తే పేద రెడ్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి సంక్షేమం కోసం రడ్డి భవన్ ఏర్పాటు చేస్తామని భరోసా కల్పించారు.
ఇలా మాట్లాడిన నారా లోకేష్,. . .గతంలో చంద్రబాబు పాలనలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది. వైయస్సార్‌తో సన్నిహితంగా ఉన్నారంటూ విద్యుత్ సంస్థ చైర్మన్ గా ఉన్న రమాకాంత్ రెడ్డిని ఎలా వేధించారో గుర్తు తెచ్చుకోవాలి.అలాగే సీనీయర్ ఐపీయస్ అధికారిగా, సర్వీసులో ఏ మచ్చ లేకుండా ఉన్న డీజీపీ ఆంజినేయ రెడ్డిని కేవలం కుల వివక్ష కారణంగా వేధించి ఆయనను పక్కన పెట్టి రాములు గారికి అవకాశం ఇచ్చిన సఃఘటన కూడా ఒకటి.
మరో ఐపీయస్ అధికారి దినేష్ రెడ్డి ని కేవలం కుల వివక్షతో నాలుగేళ్ళు పక్కన పెట్టారు.ఇంకో ఐపీయస్ అధికారి గోపీనాధ్ రెడ్డి కూడా చంద్రబాబు పాలనలో కుల వివక్షకు గురయ్యారు.అధికారులే కాదు చంద్రబాబు హయాంలో చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిని కేసుల్లో ఇరికించి పోలీస్ వ్యానులో కింద పడేసి కిలోమీటర్ల కొద్దీ తిప్పి స్టేషన్లో పెట్టీ కొట్టించిన సంఘటనను ఆయన శాసన సభలోనే వివరించిన సంగతి మరిచారు నారా లోకేష్.
ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం కులం పేరుతో చంద్రబాబు వేధించిన రెడ్డి అధికారుల లిస్ట్ చాలానే ఉంది. అధికారం కోసం రెడ్లపై ప్రేమ నటించడం ఆ తరువాత రెడ్లను అన్ని రకాలుగా దాడులు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్యని తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళు కాదు జనాలు. అంతెందుకు.. రెడ్ల మీద అవాజ్యమైన ప్రేమ చూపుతున్న లోకేష్ ఆయన తండ్రి సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డిని ఎలా టార్గెట్ చేశారో లోకానికి తెలుసు. తనతోపాటు ఎల్లోమీడియా సాయంతో తన చెంచా కులానికి కొమ్ము కాసే కొందరు అధికారులతో కలిసి అధికారులతో కలిసి జగన్, దివంగత వైయస్సార్ వ్యక్తిత్వాలను ఎంతలా దిగజార్చి రాక్షసానందం పొందారో మర్చిపోయినట్టున్నారు. అవసరానికి ఒకలా అవసరం తీరాక మరోలా మారిపోయే లోకేష్ లాంటి నేతలను ప్రజలు ఎలా నమ్ముతారో ఒక్కసారి టీడీపీ నేతలే ఆలోచించుకోవలసిన అవసరం ఉంది.