హుజూరాబాద్ వార్: ఆ బీజేపీ నేతలు ఎంట్రీ ఎప్పుడు? రాములమ్మని దింపరా?

-

తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉపఎన్నికపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేసి, అక్కడ గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీలు హుజూరాబాద్‌లో హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే టీఆర్ఎస్‌ గెలుపు కోసం రాష్ట్రంలోని మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో మకాం వేశారు. ఇంకా అభ్యర్ధిని డిసైడ్ చేయపోయినా, కారు గుర్తుకే ఓటు వేయాలని అక్కడి ప్రజలని అభ్యర్ధిస్తున్నారు.

అయితే ఇటు బీజేపీలో ఈటల రాజేందర్ ఒక్కరే నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. తన సొంత బలాన్ని నమ్ముకున్న ఈటల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ, ప్రజలని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు ఏదో చుట్టపు చూపుగా హుజూరాబాద్ వచ్చి ఈటలని పలకరించిపోతున్నట్లు కనిపిస్తోంది. స్థానికంగా ఉండే నేతలు తప్ప, బడా నేతలు హుజూరాబాద్‌లో ప్రచారాన్ని ముమ్మరం చేసినట్లు కనిపించడం లేదు.

ఈ క్రమంలోనే తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయశాంతి సైతం ఇంకా డైరక్ట్‌గా ఎంట్రీ ఇవ్వడం లేదు. ఎంతసేపు ఆమె సోషల్ మీడియాలోనే కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. బయటకొచ్చి ప్రజా సమస్యలపై పోరాటం కూడా చేయడం లేదు. అటు హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో ఎప్పుడు వస్తారో తెలియడం లేదు.

అంటే బీజేపీ నేతలు ఆహ్వానిస్తేనే రాములమ్మ ప్రచారానికి వచ్చేలా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చాక బీజేపీ అగ్రనేతలు కూడా ప్రచారానికి వస్తారని తెలుస్తోంది. కానీ ఈ లోపే పార్టీని అక్కడ మరింత బలోపేతం చేస్తూ, ఈటలకు సపోర్ట్ గా ఉండే బెటర్ అని పలువురు బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి ఏమో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నా కూడా బీజేపీ తరుపున ఇంకా సీనియర్ నేతలు, ఎంపీలు హుజూరాబాద్ ప్రచారంలో ఎంటర్ కాకపోవడంపై బీజేపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక షెడ్యూల్ వచ్చాక వారు రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news