ఈ సారి ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో రాజకీయ పోరు ఆసక్తికరంగా జరిగేలా ఉంది. గత ఎన్నికల్లో అంటే పూర్తిగా బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పోరు నడిచింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. అందుకే బిఆర్ఎస్ మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికారం దక్కించుకుంది. కానీ ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఈ సారి బిఆర్ఎస్ ఈజీగా గెలవలేదు. కాంగ్రెస్, బిజేపిలు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి.
దీంతో చాలా చోట్ల త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆందోల్ నియోజకవర్గంలో కూడా ఈ సారి ఊహించని పోరు నడిచేలా ఉంది. ఆందోల్ లో పలుమార్లు కాంగ్రెస్ నుంచి దామోదర రాజనరసింహ గెలిచిన విషయం తెలిసిందే. అలాగే టిడిపి నుంచి బాబూమోహన్ సైతం గెలిచారు. ఈ ఇద్దరు కొన్ని ఏళ్ళ నుంచి తలపడుతూ వస్తున్నారు. కానీ తెలంగాణ వచ్చాక సీన్ మారింది. టిడిపి నుంచి బాబూమోహన్ బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఇదే క్రమంలో 2014 ఎన్నికల్లో బాబూమోహన్ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దామోదర స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు.
అయితే 2018 ఎన్నికల్లో మళ్ళీ ట్విస్ట్ వచ్చింది. బాబూమోహన్‌కు కేసిఆర్ సీటు ఇవ్వలేదు..దీంతో ఆయన బిజేపిలోకి వెళ్ళిపోయారు. ఇటు బిఆర్ఎస్ నుంచి క్రాంతి కిరణ్ పోటీ చేశారు. ఇక ఆ ఎన్నికల్లో క్రాంతి..దామోదరపై గెలిచారు. బిజేపి నుంచి పోటీ చేసిన బాబూమోహన్ కేవలం 2 వేల ఓట్లు తెచ్చుకుని, దారుణంగా డిపాజిట్ కోల్పోయారు.
ఇక ఇప్పుడు అక్కడ రాజకీయం మారుతుతుంది. వరుసగా ఓడిపోతున్న దామోదరపై సానుభూతి ఉంది. బిఆర్ఎస్ బలం తగ్గుతుంది. అలా అని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడానికి లేదు..ఇక్కడ బిజేపి బలం కూడా పెరుగుతుంది. దీంతో పోరు రసవత్తరంగా ఉండేలా ఉంది. ఇక్కడ బిజేపికి పడే ఓట్ల బట్టి బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ గెలుపుపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. బిజేపి గెలవడం మాత్రం కష్టమే అని చెప్పవచ్చు.