తెలుగుదేశం పార్టీని స్థాపించింది నందమూరి తారక రామారావు. స్వశక్తితో పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చి మహా నాయకుడుగా ఎదిగారు. కానీ అనుహ్యా పరిణామాల మధ్య 1995లో ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు పార్టీని, అధికారాన్ని లాక్కున్న విషయం తెలిసిందే. అప్పుడు ఆ పరిస్థితులలో వారసులు ఎవ్వరూ ఎన్టీఆర్ పక్షాన నిలబడలేదు. రామారావు మరణం తర్వాత టిడిపి పూర్తిగా చంద్రబాబు నాయుడు ఆధీనంలోనే ఉంది.
ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు వ్యూహాలకు భయపడ్డారో, బావ అని భరోసాతో ఉన్నారో తెలియదు కానీ, రామారావు వారసులు ఎవరు తెలుగుదేశం పార్టీ తమది అని కానీ, ముఖ్యమంత్రి పదవి తమ వారసులకు ఇవ్వాలని గాని అడగలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లారు. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. లోకేష్ పై పార్టీలో సీనియర్ నాయకులకు నమ్మకం లేదు. పార్టీ నాయకత్వం ఎవరు తీసుకోవాలో తెలియని పరిస్థితులు.
బాలకృష్ణ ఇదే సమయం అనుకున్నారో, తనకు అనిపించిందో, ఎవరైనా సలహా ఇచ్చారో తెలియదు కానీ పార్టీ నాయకత్వాన్ని తన తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ దగ్గర నుండి పార్టీ తీసుకున్నప్పుడు అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు. అప్పటి వ్యవహారానికి జరిగిన సంఘటనలకు సాక్షి గానే కాదు తన వంతు సహకారం కూడా యనమల రామకృష్ణుడు చంద్రబాబుకు అందించారు అన్నది వాస్తవం. ఇప్పుడు అదే సహకారం బాలయ్యకు అందించాలనే తలంపుతో బాలకృష్ణతో కలిసి పార్టీ ప్రముఖులతో చర్చిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ తన తండ్రి స్థాపించిన పార్టీ మీద తనకు పూర్తి హక్కులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీ పగ్గాలు తనకే చెందాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో చెప్పలేం. కానీ కొందరు నందమూరి అభిమానులు మాత్రం…పార్టీ నందమూరి ఫ్యామిలీ చేతిలోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అయితే బాబు జైల్లో ఉండటం వల్ల బాలయ్య పార్టీకి అండగా ఉన్నారు తప్ప..ఆయనేమీ పార్టీ పగ్గాలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.
మరి తెలుగు దేశం పార్టీలో ఏం జరుగుతుందో?? టిడిపి పగ్గాలు ఎవరి చేతిలోకి వెళతాయో?? వేచి చూడాల్సిందే..