టిడిపి-జనసేన పొత్తు అందరికీ తెలిసిన విషయమే. ఈసారి వైసిపిని గద్దె దించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు పవన్ అంటున్నారు. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు, పవన్ సామాజిక వర్గం వారు అందరూ టిడిపికి, జనసేనకి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నారు.
పవన అభిమానులు, జనసేన కార్యకర్తల వరకైతే కచ్చితంగా టిడిపికి ఓటు వేస్తారు. కానీ పవన్ సొంత సామాజిక వర్గం వారు, పవన్ మాటకు కట్టుబడి టిడిపికి ఓటు వేస్తారా ?లేదా? అన్నది ఇటు అధికార పార్టీలోనూ ,అటు ప్రతిపక్ష పార్టీలలో ఆసక్తికరంగా మారింది. తమ పార్టీవాడు ముఖ్యమంత్రి అయితే తమ ఓట్లు టిడిపికి వేసి గెలిపించుకోవచ్చు. కానీ జనసేన కేవలం ఒక 40 సీట్ల వరకే పోటీ చేసి వాటిలో విజయం సాధిస్తే టిడిపి అధినేతను ముఖ్యమంత్రిని చేయాలని తలస్తే కాపు నేతలు ఎలా తీసుకుంటారో చూడాలి.
కాపు నేతలలో టిడిపి అంటే వ్యతిరేకులు ఎక్కువమంది ఉన్నారు. వీరందరూ వైసీపీకి వ్యతిరేకమని కాదు కానీ జనసేన అభిమానులు. జనసేన మీద అభిమానంతో టీడీపీకి ఓటు వేస్తే అధికారంలోకి టిడిపి వస్తుంది, కానీ జనసేన రాదు కదా అని కాపు సామాజిక వర్గంలోని కీలక నేతలందరూ ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాపు వారు టిడిపి కి ఓటు వేసి గెలిపిస్తారా లేదా అని ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. అలా కాకుండా కాపులు..వైసీపీ వైపు మొగ్గు చూపితే సీన్ మారిపోతుంది. పొత్తు విఫలమవుతుంది. టిడిపి, జనసేనకు నష్టం ఖాయం.