జనసేన ఎమ్మెల్యే సస్పెన్షన్..పవన్ బిగ్ డెసిషన్?

-

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ లైన్ దాటి..టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆనం రామ్ నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి..ఈ నలుగురు టి‌డి‌పికి ఓటు వేశారని చెప్పి వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. అలాగే చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు 15 నుంచి 20 కోట్ల వరకు ఇచ్చారని ఆరోపణలు చేశారు.

అయితే తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు వైసీపీ ఎంత ఇచ్చిందని టి‌డి‌పి నేతలు ప్రశ్నిస్తున్నారు. టి‌డి‌పికి చెందిన వల్లభనేని వంశీ, కరణం బలరామ్, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్..ఈ నలుగురు వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అది కూడా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా వైసీపీకి మద్ధతు ఇచ్చారు. గతంలో జగన్ తమ పార్టీలోకి ఎవరు రావాలన్న పదవులకు రాజీనామాలు చేసి రావాలని చెప్పారు. కానీ ఇప్పుడు అలా చేయలేదు. నలుగురు టి‌డి‌పి, ఒక జనసేన ఎమ్మెల్యేని తీసుకున్నారు.

Pawan Kalyan

ఇలా తమ పార్టీ ఎమ్మెల్యేలని తీసుకుని..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయించుకుని..పైగా వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు చేయగానే అమ్ముడుపోయారని కామెంట్స్ చేయడం వల్ల వైసీపీకి పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలా ఇటు నలుగురు, అటు నలుగురు అన్నట్లు అయ్యారు.

ఇదే సమయంలో జనసేన నుంచి ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ని సైతం వైసీపీ తీసుకుంది. అయితే ఇప్పుడు నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసిన నేపథ్యంలో జనసేన అధినేత సైతం..తమ ఎమ్మెల్యేని పార్టీ నుంచి సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ఈ సస్పెండ్ వల్ల ఏ ఎమ్మెల్యేకు ఏం కాదు..కానీ పార్టీ నైతిక బాధ్యతగా ఉంటుంది. ఆ పని వైసీపీ చేసింది..ఇప్పుడు పవన్ కూడా చేసి..వైసీపీకి కౌంటర్ ఇస్తారని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news