వైసీపీ అధినేత, సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరి, ఆయన దూకుడు, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతు న్న అంశాలు… ప్రవేశ పెడుతున్న పథకాలు వంటివి.. ప్రజల నుంచిమంచి మార్కులు పడేలా చేస్తున్నాయి. అయితే, అదే సమయంలో జగన్ వ్యవహారశైలిని కూడా ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఉన్నదేదో ముక్కు గుద్దినట్టు చెప్పేస్తాడు. తాను చేయలేనిది.. ఎన్నటికీ చేస్తానని చెప్పడు. తాను చేస్తాను. అని మాటిస్తే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేస్తాడు.. ఇదీ జగన్ తత్వం. దీనిని ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు.కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం తన పరిధిలో లేదని చెప్పినా..
ప్రత్యేక హోదాపై ప్లీజ్ ప్లీజ్ అంటూ.. బతిమాలాల్సిందేనని ఉద్ఘాటించినా.. ప్రజలు బాగానే రిసీవ్ చేసుకు న్నారు. కొంతమంది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీల మాదిరిగా ముఖ స్తుతి కోసంజగన్ ఏ నాడూ రాజకీయాలు చే యలేదు. ఎవరినో మెప్పించడం కోసం.. తాను చిక్కులు కొని తెచ్చుకునే లక్షణం ఆయనకు లేనే లేదు. వాస్తవానికి ఇలాంటి వ్యక్తి, వ్యక్తిత్వ లక్షణాలు వంటివి.. రాజకీయాల్లో కొంత ఇబ్బందినే సృష్టిస్తాయనడంలో సందేహం లేదు. కానీ, జగన్ మాత్రం దూకుడుగా పోతున్నారు. పాలనపరంగా ఐదు కోట్ల మంది విషయంలోనే ముక్కు సూటిగా ఖచ్చితంగా ఉంటున్న జగన్.. రాజకీయాల్లో తన పార్టీలో కూడా అదే విధంగా ఉంటున్నారు.
ఎన్నికలకు ముందు, తర్వాత కూడా ఆయన చేయాలనుకున్న పనిని చేస్తున్నారు. టికెట్లు ఇవ్వాలను కున్న వారికే ఇచ్చారు. పదవులు కూడా ఇవ్వాలని అనుకున్న నాయకులకే కట్టబెట్టారు. ఎవరు ఎన్ని విధాల ఒత్తిళ్లు తెచ్చినా.. ఆయన పట్టించుకోలేదు. ఎన్ని సమస్యలు తెచ్చినా.. ఆయన లెక్కచేయలేదు.
దీంతో సహజంగానే జగన్ అంటే.. పదవులు రాని వారికి, టికెట్లు లభించనివారికి కొంత మేరకు అసహనం ఉంటే ఉండి వచ్చు. కానీ, అంతిమంగా చూసుకున్నప్పుడు.. నాన్చుడు ధోరణి లేకుండా దూసుకు పోతున్న జగనే బెటర్ అని అనిపించకమానదు. ఏదేమైనా.. జగన్ వ్యవహార శైలి బాగోలేదన్న దాడి వంటి వారు కూడా తర్వాత కాలంలో ఆయన చెంతకే చేరుకున్నారంటే.. పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.