లోకేష్-పవన్‌కు జగన్ మళ్ళీ చెక్..అదిరే స్ట్రాటజీ.!

-

వ్యూహం: గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు..బడా బడా నేతలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. టీడీపీలో పెద్ద నేతలు ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. జనమంతా జగన్ వైపుకు రావడంతో అనూహ్యంగా టి‌డి‌పి ఓటమి పాలైంది. ఇక కీలక నేతలంతా ఓటమి బాటపట్టారు. అటు జనసేనలో కూడా కొందరు కీలక నేతలు ఓడిపోయారు. ముఖ్యంగా జగన్ దెబ్బకు..ఇటు లోకేష్, అటు పవన్ ఓటమి పాలయ్యారు.

వీరి ఓటమిని ఎవరు ఊహించలేదు. ఈ ఇద్దరు గెలుస్తారని అంతా అనుకున్నారు. కానీ జగన్ గాలిలో వారు ఓటమి పాలయ్యారు. లోకేష్ ఏమో మంగళగిరి బరిలో ఓడిపోతే..పవన్ భీమవరం, గాజువాక స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి ఇద్దరు నేతలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే లోకేష్..మళ్ళీ మంగళగిరి స్థానంలో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. అక్కడే పనిచేస్తూ వచ్చారు. ప్రజలకు అండగా నిలబడ్డారు. అక్కడ ప్రజా మద్ధతు పెంచుకునే విధంగా పనిచేశారు. దీంతో అక్కడ లోకేష్ బలం పెరిగిందనే సర్వేలు వచ్చాయి.

పైగా రాజధాని అమరావతి అంశం లోకేష్‌కు కలిసొస్తుంది. ఇలాంటి తరుణంలోనే జగన్ సరికొత్త స్కెచ్ తో ముందుకొచ్చారు. మంగళగిరి అభ్యర్ధిని ఈ సారి మార్చి..చేనేత వర్గానికి చెందిన నేతకు సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే టి‌డి‌పి లో కొందరు కీలక నేతలని వైసీపీలోకి తీసుకున్నారు. ఇక రాజధాని అమరావతి ఎఫెక్ట్ పోగొట్టడానికి..తాజాగా అక్కడ 50 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వారు వైసీపీకి మద్ధతుగా ఉంటారని భావిస్తున్నారు. దీని ద్వారా లోకేష్‌కు చెక్ పెట్టవచ్చు అనేది జగన్ ప్లాన్.

ఇటు పవన్ ఈ సారి ఎక్కడ పోటీ చేస్తారో క్లారిటీ లేదు..కానీ ఎక్కడ పోటీ చేసిన ఓడించాలని చెప్పి జగన్ చూస్తున్నారు. పవన్ పై మళ్ళీ బలమైన అభ్యర్ధిని బరిలో దించే ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఎక్కడ పోటీ చేస్తే..అక్కడ ప్రజలని ఆకర్షించేలా కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు. మొత్తానికి లోకేష్-పవన్‌కు మళ్ళీ చెక్ పెట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news