బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ కి పవన్ …!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఆయన బీజేపీ అధిష్టానం తో పాటుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా వివరించే ఆలోచనలో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఏపీ లో జరుగుతున్న సంఘటనలను ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లే అవకాశముంది. తాజాగా జరిగిన అంతర్వేది రథం సంఘటనను కూడా ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. అంతేకాకుండా ఏపీకి నిధులు కూడా కావాలని కేంద్రాన్ని కోరే అవకాశముంది. ఏపీలో ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. వాటిపై కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం అందించాలని ఆయన కోరే అవకాశాలు కనబడుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.