జీవన్‌ రెడ్డి బ్యాడ్ టైమ్..అరవింద్ వదిలేలా లేరు?

ఎట్టకేలకు వరుసగా విజయాలు సాధిస్తున్నకి సరైన ప్రత్యర్ధి దొరికారు…ఇంతకాలం తనకు తిరుగులేదని భావిస్తున్న జీవన్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ ఎంపీ అరవింద్ రెడీ అయినట్లు కనిపిస్తున్నారు. ఇంకా తమ నాయకుడు చేతిలో జీవన్‌కు ఓటమి తప్పదని బీజేపీ శ్రేణులు ఫుల్ ఫైర్ అవుతున్నాయి. మామూలుగా జీవన్ రెడ్డికి ఆర్మూర్‌లో సరైన ప్రత్యర్ధి లేరనే చెప్పొచ్చు.

2014లో జీవన్….కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సురేష్ రెడ్డిపై గెలిచారు. తర్వాత సురేష్ టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. అలాగే 2018 ఎన్నికల్లో జీవన్ రెడ్డిపై…కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆకుల లలిత ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత ఆమె కూడా కాంగ్రెస్‌ని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఆర్మూర్‌లో జీవన్‌కు సరైన ప్రత్యర్ధి లేరు. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి అరవింద్ పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎలాగో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి…కాబట్టి అరవింద్ ముందు అసెంబ్లీ బరిలో ఉంటారని తెలిసింది.

అయితే ఆర్మూర్‌లో అరవింద్ పోటీపై పూర్తి క్లారిటీ లేదు. కానీ తాజాగా ఆర్మూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొండానికి అరవింద్ వెళితే…ఆయనపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ళ దాడి చేశాయి. ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇది కేవలం టీఆర్ఎస్ దాడి అని, దీనికి బదులు తీర్చుకుంటామని అరవింద్ అంటున్నారు.

అలాగే జీవన్ రెడ్డిని 50 వేల ఓట్ల మెజారిటీతో ఓడిస్తామని, లేకపోతే తన పేరు అరవింద్ కాదని సవాల్ చేశారు. అంటే జీవన్‌పై అరవింద్ పోటీ ఖాయమని తెలుస్తోంది. పైగా గత పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్‌కు ఆర్మూర్‌లో ఎక్కువ మెజారిటీ వచ్చింది. దీంతో ఆర్మూర్‌లో అరవింద్ బరిలో దిగితే జీవన్‌ గెలుపుకు కష్టమే. ఇక నుంచే జీవన్ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అనవసరంగా అరవింద్‌ని కెలికారు.