రసవత్తరంగా జూబ్లీహిల్స్ పోరు..మాగంటికి చెక్ పెట్టేదెవరు?

-

గ్రేటర్ హైదరాబాద్‌లో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉండే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో రాజకీయం ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది. ధనవంతుల అడ్డాగా జూబ్లీహిల్స్‌ని చెబుతారు..అదే సమయంలో ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక రాజకీయంగా ఇక్కడ అనేక ట్విస్ట్‌లు ఉంటాయి. అయితే ఇక్కడ గెలుపోటములని ప్రభావితం చేసేది ఏపీ నుంచి వచ్చి సెటిలైన ఓటర్లు.

Maganti Gopinath (@MagantiGopinat) / Twitter

గత మూడు ఎన్నికల్లో వారిదే హవా..వారు ఎటువైపు ఉంటే వారిదే గెలుపు అన్నట్లు పరిస్తితి ఉంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పి‌జే‌ఆర్ వారసుడు పి.విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. అప్పుడు ఏపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 2014 ఎన్నికల్లో మాత్రం టీడీపీ వైపు మొగ్గు చూపారు. టీడీపీ నుంచి మాగంటి గోపినాథ్ పోటీ చేసి ఎం‌ఐ‌ఎం పార్టీపై 9 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడోస్థానంలో, బి‌ఆర్‌ఎస్ నాలుగో స్థానంలో నిలిచింది.

 

అయితే తెలంగాణలో టీడీపీని కే‌సి‌ఆర్ ఏ విధంగా దెబ్బతీశారో తెలిసిందే. ఈ క్రమంలోనే మాగంటి టీడీపీని వీడి బి‌ఆర్‌ఎస్ లో చేరారు. దీంతో జూబ్లీహిల్స్ లో టీడీపీ దెబ్బతింది. ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీపొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్ నుంచి పి. విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేశారు. అటు బి‌ఆర్‌ఎస్ నుంచి మాగంటి పోటీ చేశారు. కానీ విజయం మాగంటిని వరించింది. అయితే ఈ సారి అక్కడ మాగంటికి అంత అనుకూలత కనిపించడం లేదు. అదే సమయంలో బి‌జే‌పి బలపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.

దీంతో ఈ సారి ఇక్కడ ట్రైయాంగిల్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ టీడీపీకి కాస్త ఓటింగ్ ఉంది..గత ఎన్నికల్లో వారు బి‌ఆర్‌ఎస్‌కు సపోర్ట్ చేశారు. మరి ఈ సారి ఎన్నికల్లో ఎటువైపు నిలుస్తారో ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి జూబ్లీహిల్స్ పోరు ఈ సారి రసవత్తరంగా సాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news