జూపల్లి రెడీ..పొంగులేటి లేటుగా..కాంగ్రెస్‌కు ఊపిరి.!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి వస్తుంది. ఓ వైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడంతో..ఆ పార్టీకి తెలంగాణలో కూడా కొత్త ఊపు వచ్చింది. మరోవైపు పార్టీలో చేరికలు కూడా ముమ్మరం అవుతున్నాయి. మొన్నటివరకు బి‌జే‌పిలోకి వలసలు ఎక్కువ నడిచాయి. కానీ ఇపుడు సీన్ మారుతుంది. రాష్ట్రంలో బి‌జే‌పికి పూర్తి స్థాయి బలం లేదనే విషయం అర్ధమవుతుంది.

దీంతో కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. మునుగోడు ఉపఎన్నిక దగ్గర నుంచే బి‌జే‌పిలోకి వలసలు ఆగిపోయాయి. పార్టీలోకి నేతలని తీసుకురావాలని ట్రై చేస్తున్న అది వర్కౌట్ కావడం లేదు. ఇటీవల బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులని బి‌జే‌పిలోకి తీసుకురావాలని ఈటల రాజేందర్ ఏ స్థాయిలో ట్రై చేశారో తెలిసిందే. వారితో పలుమార్లు భేటీ అయ్యారు. కానీ వారు బి‌జే‌పిలోకి రావడానికి ఇష్టపడటం లేదని..పైగా ఈటలనే కాంగ్రెస్ లోకి రమ్మని రివర్స్ లో కౌన్సిలింగ్ ఇస్తున్నారట. ఆ విషయం స్వయంగా ఈటల మీడియాకి చెప్పారు.

అంటే ఈ ఇద్దరు నేతలు ఇంకా బి‌జే‌పిలోకి రావడం కష్టమని చెప్పవచ్చు. అదే సమయంలో వారు కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారని తెలిసింది. కాకపోతే ఇద్దరు నేతలు ఒకేసారి పార్టీలోకి రావట్లేదు. మొదట జూపల్లి కాంగ్రెస్ లో చేరతారని సమాచారం వచ్చింది. జూన్ 8న జూపల్లి తన అనుచరులతో పాటు కొందరు కీలక నేతలని తీసుకుని కాంగ్రెస్ లో చేరతారని తెలిసింది.

ఇక జూన్ 20న భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు ఉంది. ఆ తర్వాత ఖమ్మంలో భారీ సభ పెట్టి పొంగులేటి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరిపోతారని కథనాలు వస్తున్నాయి. మొత్తానికి ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version