కందుకూరు ఘటనపై రాజకీయం..కేసు నమోదులో ట్విస్ట్..!

-

ఏపీ రాజకీయాల్లో కందుకూరులో టీడీపీ కార్యకర్తలు చనిపోవడం సంచలనం మారిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు కందుకూరు రోడ్ షోలో పాల్గొన్నారు. అలాగే అక్కడే ఉన్న ఎన్టీఆర్ సర్కిల్‌లో సభ నిర్వహించారు..ఈ సభకు భారీ స్థాయిలో జనం రావడం..తోపులాట జరగడం..దీంతో కొందరు తొక్కిసలాటకు గురై మరణించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు హాస్పిటల్‌కు వెళ్ళడం బాధితులని పరామర్శించడం జరిగింది. 8 మంది కార్యకర్తలు చనిపోయారని తెలుసుకుని బాబు కన్నీరు పెట్టుకున్నారు.

ఇక 7 మంది గాయపడ్డారు. వారందరికి ఒక్కో కుటుంబానికి 10 లక్షల సాయం ప్రకటించారు. ఆ ఫ్యామిలీలని అన్నివిధాలుగా ఆదుకుంటానని అన్నారు. ఇప్పటికీ ఆయన అక్కడే ఉండి కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. అయితే సాయాన్ని 15 లక్షలకు పెంచి..తనవంతుకు మరో 8 లక్షలు బాబు ఇస్తున్నారని తెలిసింది. అటు టీడీపీ నేతలు ఎవరికి వారు తమకు తోచిన సాయం అందిస్తున్నారు. ఇటు ప్రధాని మంత్రి మోదీ సైతం కందుకూరు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి..చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50 వేలు సాయం ప్రకటించారు.

ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం జగన్ సైతం చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడ్డవారికి 50 వేలు సాయం ప్రకటించారు. అయితే విపక్ష పార్టీలు అన్నీ సంతాపం తెలియజేస్తున్నాయి. కానీ అధికార వైసీపీ మాత్రం చంద్రబాబుపై విమర్శలు చేస్తుంది. పబ్లిసిటీ పిచ్చతో ఇరుకు రోడ్డులో సభ పెట్టారని అందుకే తొక్కిసలాట జరిగి చనిపోయారని అంటున్నారు.

అయితే ఇదే ఎన్టీఆర్ సర్కిల్‌లో గతంలో జగన్ పాదయాత్ర సమయంలో సభ పెట్టారని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. తమ కార్యకర్తలని కోల్పోయి బాధలో ఉన్నామని, అయినా సరే ఆ కుటుంబాలకు పార్టీ తరుపున..టీడీపీ నేతలు సైతం సాయం అందిస్తున్నారని, అండగా ఉంటున్నారని అంటున్నారు. కానీ వైసీపీలో ఎవరైనా చనిపోతే జగన్ ఏమన్నా సాయం చేశారా? అని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే  కందుకూరు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డుకు ఇచ్చిన అనుమతికి విరుద్దంగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించడం వల్లే ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు కేసులో పేర్కొన్నారు. సెక్షన్ 174 క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై దర్యాప్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు పోలీసులు సిద్దమవుతున్నారు. అంటే ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది..ఎవరిపై కేసులు నమోదు చేస్తారనేది ఉత్కంఠగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news