స్పీడ్ పెంచిన కరోనా .. కే‌సి‌ఆర్ చెప్పింది చెయ్యల్సిందేనా..!!

-

ఇండియాలో లాక్ డౌన్ ప్రకటించిన కరోనా వైరస్ ఉన్న కొద్ది విజృంభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణలో అయితే స్పీడ్ పెంచింది. తెలంగాణ ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటున్న మరోపక్క కరోనా వైరస్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ప్రధాని మోడీ పిలుపుమేరకు రెండు తెలుగు రాష్ట్రాలలో కర్ఫ్యూ చాలా కట్టుదిట్టంగా ఇద్దరు ముఖ్యమంత్రులు పాటిస్తున్నారు.Image result for kcr corona virusఅయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాలలో కేసులు  పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే…విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ నుండి మాత్రమే  కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉన్న కొద్దీ ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్న కొంతమంది ఆకతాయిలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పోలీసులకు సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారు.

 

లాక్ డౌన్ ప్రకటించిన గాని ప్రజలు విస్తృతంగా రోడ్ల పైకి రావడంతో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎంత సీరియస్ గా చెప్పిన ఎవరు మాట వినేటట్లు కనబడని పరిస్థితులు ఉంటున్న తరుణంలో తెలంగాణ పోలీసులు ముఖ్యమంత్రి కెసిఆర్ ని షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మరోపక్క ఇదే విషయాన్ని రోడ్లపై దొరికిన ప్రజలకు లాఠీలు కాదు, మీకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ రావాల ? అంటూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మొదటిలో జనతా కర్ఫ్యూ విధించిన సందర్భంలో …మాట వినకుండా రోడ్లపైకి వచ్చిన వారిని ఉద్దేశించి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పోలీసులకు ఇస్తా పిచ్చి పిచ్చి వేషాలు వేయ్యవద్దు ఒక్కడి వల్ల అందరూ చనిపోవలసింది అంటూ కెసిఆర్ మీడియా సమావేశంలో ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తెలంగాణలో కర్ఫ్యూ పాటించకుండా వ్యవహరిస్తున్న వారిని ఉద్దేశించి నెటిజన్లు కే‌సి‌ఆర్ చెప్పింది పోలీసులు చెయ్యల్సిందే అంటూ సీరియస్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news