కొడాలి కాన్ఫిడెన్స్..ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు..కానీ!

-

ఏపీలో మరోసారి మాజీ కొడాలి నాని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..ఎప్పుడు మీడియాతో మాట్లాడిన చంద్రబాబుని గాని, లోకేష్‌ని గాని బూతులు తిడుతూ ఉండే కొడాలి నాని..మరోసారి వారిద్దరిపై ఫైర్ అయ్యారు.  ప్రభుత్వ పరంగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీడియాతో చెప్పని కొడాలి..ఎప్పుడు బాబుని తిడుతూనే ప్రెస్ మీట్లు పెడతారనే విషయం తెలిసిందే.

తాజాగా గన్నవరం పర్యటనకు వెళ్ళిన చంద్రబాబుని నల్లమల అడవుల్లో తాను, వంశీ కొడితే పోతాడు అంటూ మాట్లాడారు. ఇక యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్‌ తాజాగా విద్యార్ధులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారా? అనే ప్రశ్న లోకేష్‌కు ఎదురైంది. దానికి సమాధానంగా..నూటికి నూరు శాతం ఆహ్వానిస్తానని, రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్న వారు..తప్పకుండా రాజకీయాల్లోకి రావాలని కోరారు. లోకేష్ సమాధానంపై కొడాలి స్పందిస్తూ..అసలు ఎన్టీఆర్‌ని ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు? అని టి‌డి‌పి ఆయన తాత పెట్టిన పెట్టిన పార్టీ అని, చంద్రబాబు, లోకేష్ తప్పుకుని ఎన్టీఆర్‌కు టి‌డి‌పి పగ్గాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో ఎన్టీఆర్ కాదు కదా..ప్రభాస్, మహేశ్ బాబు వచ్చిన టి‌డి‌పిని కాపాడలేరని, ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే కనీసం టి‌డి‌పి ప్రతిపక్షంలోనైనా ఉంటుందని కొడాలి చెప్పుకొచ్చారు. అంటే ఇంకా టి‌డి‌పికి మనుగడ లేదన్నట్లు కొడాలి కాన్ఫిడెన్స్ గా చెప్పారు. ఎన్టీఆర్ వచ్చిన పార్టీని బాగుచేయలేరనే విధంగా మాట్లాడారు.

మరి కొడాలి చెబుతున్నట్లే టి‌డి‌పి పరిస్తితి అలా ఉందా? అంటే అది ప్రజలకు బాగా తెలుసని చెప్పవచ్చు. వైసీపీ చేస్తున్న కొన్ని తప్పులు..కొడాలి లాంటి వారు బూతులు తిట్టడం వల్లే పరోక్షంగా టి‌డి‌పి బలపడిందని చెప్పాలి. మామూలుగా వదిలేసిన ఎలాంటి ఇబ్బంది లేదు గాని..టి‌డి‌పిని అణిచివేయాలనే క్రమంలో వైసీపీ చేసిన రాజకీయం రివర్స్ అయిందని చెప్పవచ్చు. మరి టి‌డి‌పికి ప్రజలు ఏ స్థానం ఇస్తారో వచ్చే ఎన్నికల్లో తేలుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version