ఏపీ రాజకీయాల్లో టిడిపి అధినేత చంద్రబాబుకు తలనొప్పి తెప్పించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని అనే చెప్పాలి. అసలు జగన్ వల్ల కూడా బాబు పెద్దగా ఇబ్బంది పడరేమో గాని..కొడాలితో మాత్రం పెద్ద చిక్కులే. కొడాలి నిత్యం చంద్రబాబుని తిడుతూనే ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబుని కొడాలి ఎన్ని రకాలుగా తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు.
అందుకే కొడాలికి చెక్ పెట్టాలని చెప్పి చంద్రబాబు చూస్తున్నారు. గుడివాడలోనే కొడాలిని ఓడించాలని చూస్తున్నారు. కానీ అక్కడ కొడాలిని నిలువరించలేని పరిస్తితి. గతంలో రెండుసార్లు టిడిపి నుంచి గెలిచిన కొడాలి..ఆ తర్వాత రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి, 2014, 2019 ఎన్నికల్లో కొడాలి వైసీపీ నుంచి గెలిచారు. ఇలా నాలుగుసార్లు గెలిచిన కొడాలి ఇప్పుడు ఐదోసారి కూడా గెలవాలని చూస్తున్నారు. అయితే గతంలో మూడుసార్లు గెలిచినప్పుడు కొడాలి అధికారంలోకి రాలేదు. దీంతో ప్రతిసారి గుడివాడ ప్రజలు..అధికారంలోకి రావట్లేదు కదా..అందుకే కొడాలి గుడివాడకు ఏం చేయలేకపోతున్నారని అనుకున్నారు.
కానీ ఇప్పుడు అధికారంలో ఉంటూ కూడా ఏం చేయలేకపోతున్నారనే విమర్శలు ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొడాలి..గుడివాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మరీ దారుణంగా ఉన్న గుడివాడ బస్టాండ్‌ని మారుస్తున్నారు. కొత్త బస్టాండ్‌కు శ్రీకారం చూడుతున్నారు.త్వరలో జగన్ చేత బస్టాండ్ కు శంఖుస్థాపన చేయించనున్నారు.
ఇలా పనులు చేస్తూ ఉండటంతో..మళ్ళీ గుడివాడ ప్రజలు తనని ఆదరిస్తారని, గుడివాడలో ఐదో విజయం సాధిస్తానని అంటున్నారు. టిడిపి నుంచి ఎవరు బరిలో దిగిన్ గెలుపు తనదే అని ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో గుడివాడలో కొడాలికే కాస్త ఎడ్జ్ ఉంది. మరి ఎన్నికల సమయానికి ఏమైనా పరిస్తితులు మారి..కొడాలిని టిడిపి నిలువరిస్తుందేమో చూడాలి.