సిరిసిల్ల నియోజకవర్గం..మంత్రి కేటీఆర్ అడ్డా..ఇక్కడ కేటీఆర్ విజయాలకు బ్రేకులు వేయడం ఏ పార్టీ వల్ల కాదు..అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఈ సారి ఎన్నికల్లో కేటిఆర్‌ని నిలువరించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి..ఎలాగైనా కేటిఆర్ స్పీడుకు బ్రేకులు వేయాలని చూస్తున్నారు. దీంతో ఈ సారి సిరిసిల్ల పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గతంలో సిరిసిల్ల నియోజకవర్గం చరిత్ర ఒక్కసారి చూస్తే..ఇది కమ్యూనిస్టుల కంచుకోట. సిపిఐ నాలుగుసార్లు అక్కడ గెలిచింది. కాంగ్రెస్ కొన్ని సార్లు సత్తా చాటింది. 2004 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి విజయం సాధించింది. ఇక 2009 ఎన్నికల్లో సిరిసిల్ల సీటు విషయంలో ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. అప్పుడు టిఆర్‌ఎస్..టిడిపితో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. ఇక పొత్తులో భాగంగా ఈ సీటు టిడిపి..టిఆర్‌ఎస్‌కు వదిలింది. అప్పుడు టిఆర్‌ఎస్ లో కేకే మహేందర్ రెడ్డి యాక్టివ్ ఉన్నారు. కానీ కేసిఆర్ తన తనయుడు కేటిఆర్‌ని తొలిసారి ఎన్నికల బరిలో దింపారు.
దీంతో కేకే టిఆర్‌ఎస్ వదిలి కాంగ్రెస్ లోకి వెళ్ళి పోటీ చేశారు. దీంతో కేకే, కేటిఆర్‌ల మధ్య పోరు జరిగింది. కానీ కేటిఆర్‌కు టిడిపితో పాటు కమ్యూనిస్టుల సపోర్ట్ లభించింది. అయినా సరే 172 ఓట్లతోనే గెలిచారు. కానీ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామాలు చేయడంతో ఉపఎన్నికలు వచ్చాయి. 2010 ఉపఎన్నికలో కేటిఆర్ మంచి మెజారిటీతో గెలిచారు.
తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల్లో 53 వేలు ఓట్లు, 2018లో 89 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే కేటిఆర్..సిరిసిల్లని అభివృధ్ది బాటపట్టించడంతోనే అక్కడ ప్రజలు మద్ధతు పెరిగింది. ఈ సారి కేటిఆర్ పై కాంగ్రెస్ నుంచి కేకే బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. కేకే రాజకీయంగా దూకుడుగా లేరు. కేటిఆర్‌ని ఢీకొట్టడం కష్టమే. కాస్త మెజారిటీ తగ్గితే తగ్గొచ్చు..లేదంటే లేదు గాని..కేటిఆర్ విజయాన్ని ఆపడం కష్టమే..