వైసీపీకి-లోకేష్-సవాల్-ఆ-స

-

ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి వైసీపీ..చంద్రబాబు, నారా లోకేష్ లపై అనేక ఆరోపణలు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అమరావతి అంశం, ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఫైబర్ నెట్ ఇలా చాలా అంశాల్లో గత టీడీపీ ప్రభుత్వం స్కామ్ చేసిందని వైసీపీ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఆరోపణలు కొనసాగించింది. కానీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క అంశాన్ని నిరూపించేలేకపోయిందని వైసీపీపై టీడీపీ ఫైర్ అవుతూ వచ్చింది. కానీ కొన్ని అంశాలపై కేసులు పెట్టారు గాని..చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు.

ఇదే క్రమంలో తాజాగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, డైరెక్టరుతో సహా 26 మందికి నోటీసులు పంపించారు. విచారించడం చేస్తుంది. ఈ క్రమంలో ఈ స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్‌లు కూడా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీంతో సజ్జల ఆరోపణలపై నారా లోకేష్ స్పందించారు.

స్కిల్ డెవలప్మెంట్‌కు సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణలపై దమ్ముంటే 24 గంటల్లో ఆధారాలు బయటపెట్టాలని ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు చేసి పారిపోవడం వైసీపీ నేతలకు అలవాటని, వైసీపీ నేతలు మాదిరిగా అందరూ అవినీతిపరులే అని ప్రజల్ని మభ్యపెట్టడానికే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు ఏళ్ల 8 నెలలు అయ్యిందని, అలాగే వారు చెయ్యని విచారణ లేదని, తనతో పాటు చంద్రబాబుపై చేసిన ఆరోపణల్లోనూ వాస్తవం లేదని తేలిపోయిందని, తాము కూడా వైసీపీ వాళ్ళకు లాగా అవినీతికి పాల్పడి చిప్పకూడు తింటాం అనుకోవడం అవివేకమని, ఇన్సైడర్ ట్రేడింగ్ , ఫైబర్ గ్రిడ్, ఐటి కంపెనీలు రాయితీలు, ఇలా అనేక విషయాల్లో తనపై అవినీతి బురద జల్లారని, ఒక్క ఆరోపణలో కూడా ఆధారాలు చూపలేక పారిపోయారని, ఇప్పుడు ఇందులో కూడా ఏమన్నా ఆధారాలు చూపించాలని చెప్పి ఛాలెంజ్ చేశారు. మరి లోకేష్ ఛాలెంజ్‌కు వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news