ఒక్క ఓటు..ఏపీలో ఉత్కంఠగా ఎమ్మెల్సీ పోరు!

-

ఒక్క ఓటు..ఒకే ఒక్క ఓటు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠత సృష్టిస్తుంది. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి ట్విస్ట్ వస్తుందా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల కోటాలో జరిగిన 8 స్థానాల్లో, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలని వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల్లో వైసీపీదే పూర్తి బలం అందుకే అన్నీ స్థానాలు వైసీపీ దక్కించుకుంది.

ఇక ప్రైవేట్ టీచర్లకు ఓటు హక్కు ఇవ్వడం..ఉపాధ్యాయ సంఘాలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ జరిగి 2 స్థానాల్లో గెలిచింది. కానీ అసలైన మూడు పట్టభద్రుల స్థానాల్లో మాత్రం వైసీపీ చిత్తు అయింది. మూడు స్థానాలని టి‌డి‌పి సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకునేలా ఉంది. మొత్తం 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో ఎమ్మెల్సీ స్థానం గెలవాలంటే 22 ఎమ్మెల్యేలు కావాలి.

వైసీపీకి 151, టి‌డి‌పికి 23, జనసేన 1 ఎమ్మెల్యే బలం ఉంది. అంటే 6 స్థానాలు వైసీపీ, ఒక స్థానం టి‌డి‌పి గెలుచుకోవచ్చు. కానీ టి‌డి‌పి నుంచి 4 గురు, జనసేన ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో వైసీపీ బలం 156..అంటే 7 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకోవచ్చు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకొచ్చారు. వారు టి‌డి‌పికి మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో టి‌డి‌పి బలం 21కు వెళుతుంది.

అంటే ఒక ఎమ్మెల్యే కావాలి..టి‌డి‌పి రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరు మారిన సీన్ రివర్స్ అవుతుంది..లేదా మరో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే వచ్చినా సరే సీన్ రివర్స్. మరి చూడాలి ఆ ఒక్క ఓటుతో ట్విస్ట్ ఉంటుందా? లేదా వైసీపీ 7 స్థానాలు గెలుచుకుంటుందేమో.

Read more RELATED
Recommended to you

Latest news