జగిత్యాల రాజకీయాల్లో అసమ్మతిని చల్లార్చడానికి ఎమ్మెల్సీ ఎల్ రమణ రంగంలోకి దిగారు. జిల్లాలోని కౌన్సిలర్లు రమణతో భేటీ అయ్యారు. అధికార పార్టీకి చెందిన జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి రాజీనామాతో ఎమ్మెల్సీ ఎల్.రమణతో స్థానిక కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు.
ఆమె పదవికి రాజీనామా చేసినప్పటికీ పార్టీ ధిక్కారణ చర్యలకు పాల్పడిందని ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు పలువురు కౌన్సిలర్లు ఆయనకు సూచించారు. భవిష్యత్ కార్యచరణపై ఏం చేయాలనే అనే విషయం కౌన్సిలర్లతో రమణ మాట్లాడారు. అయితే ఏ విషయమై అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె తన పదవికి రాజీనామా చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వేధింపులతోనే తాను రాజీనామా చేస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.