ఎంపీ అర్వింద్ మీద దాడి… రాష్ట్ర సీఎస్, డీజీపీలకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

-

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై గత నెల 25న ఆర్మూర్ లో జరిగిన దాడిపై సీరియస్ అయింది పార్లమెంట్ ప్రివిలేజ్, ఎథిక్స్ కమిటి. గత నెలలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని ఎంపీ అర్వింద్ ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలు, నాయకులకు గాయాలయ్యాయి. ఎంపీ కారు తీవ్రంగా ధ్వంసం అయింది. అయితే ఈ ఘటనపై టీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాయి.

తనపై దాడి ఘటనను ఎంపీ అర్వింద్ లోక్ సభ స్పీకర్ తో పాటు ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కాగా తాజాగా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ, ఎథిక్స్ కమిటీలు రాష్ట్ర సీఎస్, హెం శాఖ సెక్రటరీ, డీజీపీ, నిజామాబాద్ కలెక్టర్, సీపీలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి 15 రోజుల్లో నివేదికను లోక్ సభ స్పీకర్ కు సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. దాడి జరిగిన తర్వాత నిజామాబాద్ సీపీతో పాటు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు ఎంపీ అర్వింద్.

Read more RELATED
Recommended to you

Latest news