పాలకుర్తి పోరు: ఎర్రబెల్లి వర్సెస్ కొండా?

-

రాయలసీమలో కొన్ని ఫ్యామీలిల ఫ్యాక్షన్ గొడవలు ఎలా ఉంటాయో..తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా…ఎర్రబెల్లి కుటుంబాల మధ్య కూడా ఎప్పటి నుంచి శతృత్వం నడుస్తోంది. గతంలో ఎర్రబెల్లి దయాకర్ టీడీపీలో ఉండగా, కొండా మురళీ, సురేఖ దంపతులు కాంగ్రెస్ లో ఉండేవారు. ఎవరు పార్టీ అధికారంలో ఉంటే వారు రాజకీయంగా పైచేయి సాధించేవారు. ఎన్నో దశాబ్దాల కాలం నుంచి వీరి మధ్య పంచాయితీ నడుస్తోంది.

అయితే రాజకీయంగా ఎప్పుడు తలపడిన సందర్భాలు లేవు…కానీ నెక్స్ట్ ఎన్నికల్లో పాలకుర్తిలో కొండా మురళీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరగడం ఆసక్తికరంగా మారింది. పాలకుర్తి అంటే ఎర్రబెల్లి అడ్డా..అక్కడ ఆయనని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. టీడీపీలో ఉండగా వర్ధన్నపేట నుంచి మూడుసార్లు, ఒకసారి వరంగల్ ఎంపీగా, ఇక 2009 నుంచి పాలకుర్తిలో టీడీపీ తరుపున గెలిచారు. 2014లో కూడా టీడీపీ నుంచే గెలిచారు.

తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్ళి..2018లో మళ్ళీ గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక పాలకుర్తిలో ఎర్రబెల్లికి రాజకీయంగా బలం ఎక్కువ..ఆయన్ని ఓడించడం కాంగ్రెస్, బీజేపీలకు సాధ్యమయ్యే పని కాదు. అయితే కాంగ్రెస్ లో ఉన్న కొండా ఫ్యామిలీ నెక్స్ట్ ఎన్నికల్లో మూడు సీట్లు కావాలని అడుగుతున్నారు. ఇప్పటికే వరంగల్ తూర్పు, పరకాల సీట్లు ఫిక్స్….మూడో సీటుగా భూపాలపల్లి గాని, పరకాల గాని అడుగుతున్నట్లు తెలుస్తోంది.

మూడు సీట్లు వస్తే…వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ…పరకాల నుంచి ఆమె తనయురాలు కొండా సుస్మితా…ఇక సీటు దొరికిన అక్కడ కొండా మురళీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. అయితే పరకాల సీటు గాని వస్తే…ఎర్రబెల్లి…కొండాల మధ్య రసవత్తరమైన పోరు జరుగుతుంది. మిగతా నేతల సంగతి చెప్పలేం గాని…కొండా బరిలో ఉంటే ఎర్రబెల్లికి గట్టి పోటీ ఇవ్వొచ్చు. చూడాలి మరి కొండా ఫ్యామిలీకి పరకాల సీటు కూడా దక్కుతుందో లేదో…

Read more RELATED
Recommended to you

Latest news