టార్గెట్ పట్టాభి..అసలు తెర వెనుక ఏం జరుగుతోంది?

-

పట్టాభి…టీడీపీ అధికార ప్రతినిధి…టీడీపీ తరుపున బలంగా వాయిస్ వినిపించే నాయకుల్లో ఒకరు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి మీడియా సమావేశాల్లో గానీ, టీవీ డిబేట్లలో గానీ పార్టీ తరుపున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల డ్రగ్స్, గంజాయి అంశంపై మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాగే బొషిడికే అని తిట్టారు..అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని తిట్టారా లేక జగన్‌ని తిట్టారా అనేది క్లారిటీ లేదు. ఎవరిని తిట్టిన అది తప్పే.

pattabhi
pattabhi

అయితే పట్టాభి తిట్టింది జగన్‌నే అని చెప్పి వైసీపీ శ్రేణులు…టీడీపీ ఆఫీసుపై పట్టాభి ఇంటిపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఒక చిన్నపాటి యుద్ధం నడుస్తోంది. ఇదే క్రమంలో ఈ గొడవల మధ్యలోనే పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేయడం, ఆయన బెయిల్ మీద విడుదల అయిపోవడం జరిగాయి.

బెయిల్ మీద నుంచి బయటకు రాగానే పట్టాభి ఫ్యామిలీతో కలిసి మాల్దీవులుకు వెళ్లిపోయారు. భయపడి వెళ్లిపోయారని వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి..లేదు దాడుల వల్ల తన ఫ్యామిలీ భయపడిందని, అందుకే కాస్త రిలీఫ్ కోసం వారిని మాల్దీవులకు తీసుకొచ్చినట్లు పట్టాభి చెప్పారు.

ఇదే క్రమంలో పట్టాభిని భౌతికంగా లేకుండా చేసి, ఆ నెపం వైసీపీ మీద నెట్టేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశారని విజయసాయిరెడ్డి మాట్లాడారు. అసలు అలాంటి ఆలోచన విజయసాయికి ఎందుకు వచ్చిందో కూడా ఎవరికి అర్ధం కాలేదు. అయితే పట్టాభిపై దాడికి వైసీపీ ప్లాన్ చేసిందని, కానీ తెలివిగా విజయసాయి ముందుగానే, అది బాబు ప్లాన్ అన్నట్లు క్రియేట్ చేస్తున్నారని, పట్టాభికి ప్రాణహాని ఉందని, ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది అని టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి. ఇటు ఏమో రఘురామకృష్ణం రాజు ఏమో…కస్టడీలో పోలీసులు పట్టాభిని కొట్టారని అంటున్నారు. అసలు పట్టాభి చుట్టూనే మొత్తం రాజకీయం నడుస్తోంది. మరి తెరవెనుక ఎలాంటి కథ నడుస్తుందో తెలియడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news