కల్యాణ్ నో క్లారిటీ..తేడా కొట్టేస్తుందే?

-

ఏంటో పవన్ పోరాటాలు అద్భుతంగా ఉంటున్నాయి గాని…అసలు ఆయన పోరాటాలు ఎవరికోసమో అనేది క్లారిటీ ఉండటం లేదు. అదేంటి ప్రజల కోసం ఆయన పోరాటం చేస్తున్నారు..అలా పోరాటాలు చేయడం వల్ల..జనసేన పార్టీకి ప్లస్ అవుతుంది కదా అని అంతా అనుకోవచ్చు. ఒకవేళ అలాగే జరిగితే అదే నిజం అనుకోవచ్చు. మరి అలాగే జరుగుతుందా? పవన్ మైలేజ్ పెరుగుతుందా? అంటే అబ్బే పెద్దగా లేదని విశ్లేషకులు అంటున్నారు.

వాస్తవానికి పవన్..వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాడుతున్నారు..నిత్యం ఏదొక సమస్యపై గళం విప్పుతున్నారు…ప్రజలకు అండగా ఉంటున్నారు..జగన్ సర్కార్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ విధంగా పవన్ దూకుడుగా ముందుకెళుతున్నారు…సరే పవన్ బాగానే పోరాటం చేస్తున్నారు…ఆయన పోరాటం వల్ల వైసీపీకి నెగిటివ్ అవుతుందని అనుకోవచ్చు…అదే సమయంలో పవన్ కు ప్లస్ కూడా అవ్వాలి.

ప్లస్ అనేది అవుతుంది గాని…పూర్తి స్థాయిలో అవ్వడం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన వైసీపీని టార్గెట్ చేస్తున్నారు గాని..బలంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేయడం లేదు.

సరే మొన్నటివరకు పొత్తులు అన్నారు…మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చుకున్నారు…కానీ ఆ మధ్య పొత్తులు లేవు..ప్రజలతోనే మా పొత్తు అనే అన్నారు..మరి అలా అన్నప్పుడు టీడీపీని టార్గెట్ చేయాలి…ఆ పార్టీ విధానాలపై విమర్శలు చేయాలి..అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులని ఎత్తి చూపాలి. కానీ పవన్ అలా చేయడం లేదు. కేవలం జగన్ నే టార్గెట్ చేస్తున్నారు. దీని వల్ల టీడీపీకి ప్లస్ అవుతుంది. ఆ విషయం పవన్ కు కూడా అర్ధమయ్యి ఉండాలి.

అంటే వైసీపీపై ఎంత నెగిటివ్ పెరిగితే..అంతగా టీడీపీకి పాజిటివ్ వస్తుంది…ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ తర్వాత స్ట్రాంగ్ గా ఉన్న పార్టీ టీడీపీనే. అయితే పరోక్షంగా టీడీపీకి లబ్ది చేకూర్చే పనిలోనే పవన్ ఉన్నట్లు వైసీపీ వాళ్ళు డౌట్ పడుతున్నారు…అందుకే వారు పవన్ ని…చంద్రబాబు దత్తపుత్రుడు అని విమర్శిస్తూ ఉంటారు..పవన్ ఏం చేసిన అది బాబు ఖాతాలోకే వెళుతుంది. అయితే నెక్స్ట్ పొత్తు పెట్టుకోవాలి కాబట్టి పవన్ ఇప్పుడు టీడీపీని టార్గెట్ చేయడం లేదని తెలుస్తోంది. మొత్తానికైతే పొత్తు మాత్రం ఫిక్స్ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news