ఇప్పడు తెలంగాణలో హుజూరాబాద్ రాజకీయాలు ఎంత వేడిగా సాగుతున్నాయో తెలిసిందే. అయితే గత 20 ఏండ్లుగా ఈ నియోజకవర్గంలో ఈటల రాజేదర్ ఎమ్మెల్యేగా ఉంటూ వస్తున్నారు. కాగా ఆయన ఇప్పుడు టీఆర్ ఎస్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికకు తెరలేపినట్టు అయింది. దీంతో ఇప్పుడు ఆయనపై గెలిచి తన పంతం నెగ్గించుకోవలని అధికార పార్టీ నానా తంటాలు పడుతోంది. ఇందుకోసం ఏకంగా దళిత బంధు లాంటి స్కీమ్‌ను కూడా తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు బీజేపీ కూడా జోరుగానే ప్రచారం చేస్తోంది.
కాగా చాలా వర్గాల నుంచి ఈటలకు మద్దతు బాగానే వస్తోంది. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తన రాజీకీయాలను బాగానే చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ మీద కేసీఆర్ చేస్తున్న పనులు మంచివి కావని చెబుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈటల రాజేందర్‌కు బాగానే మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఈటల బీసీ కావడంతో ఆయనపై ఇన్ని కుట్రలు ఏంటని ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు.
ఒక బీసీ నేతపై ఇలాంటి పథకాలు పెట్టి బీసీలను అణగదొక్కాలని కేసీఆర్ చూస్తున్నారంటూ ప్రవీణ్ కుమార్ విమర్శిస్తున్నారు. ఇక పోతే హుజూరాబాద్ లో ఖర్చుపెడుతున్న డబ్బులు కూడా ప్రజలవేనని అలాంటి వాటిని ఎందుకు అనవసరంగా ఖర్చు పెడుతున్నారంటూ మండిపడుతున్నారు. బీసీలను కేసీఆర్ తొక్కేస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈయన మాటలు కాస్తా ఈటలకు పెద్ద ప్లస్ అవుతున్నాయి. ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన మాటలు ఈటలకు ఏదో ఒక రకంగా కలిసి వచ్చేలాగే కనిపిస్తున్నాయి.