ఈ సారి ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయం హాట్ హాట్‌గా సాగుతుంది..దశాబ్దాల కాలం నుంచి చంద్రబాబు, పెద్దిరెడ్డిల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి చంద్రబాబు కంచుకోట కుప్పంపై పెద్దిరెడ్డి ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ఎలాంటి రాజకీయం నడిపిస్తున్నారో తెలిసిందే. ఎలాగైనా కుప్పంలో బాబుని ఓడించాలని పెద్దిరెడ్డి పనిచేస్తున్నారు.
ఇదే సమయంలో పెద్దిరెడ్డి రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. ఓ వైపు కుప్పంలో తన బలం తగ్గకుండా చూసుకుంటూనే..మరోవైపు పెద్దిరెడ్డి కంచుకోట పుంగనూరుపై ఫోకస్ చేశారు. అక్కడ పెద్దిరెడ్డిని ఓడించాలని చెప్పి పనిచేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అక్కడ దూకుడుగా పనిచేస్తున్నారు. కానీ అక్కడ ఆయన బలం సరిపోయేలా లేదు. పెద్దిరెడ్డిని నిలువరించడానికి ఆ బలం సరిపోదు. ఇదే సమయంలో పుంగనూరు పోరులో కొత్త నేత తెరపైకి వచ్చారు . వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డిపై పోటీకి రెడీ అని ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ ప్రకటించారు.
ఇటీవల ఆయన ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దగ్గరకెళ్లి పుంగనూరు పరిస్తితులని వివరించారు. అలాగే ఆయనకు వై కేటగిరీ భద్రత ఇచ్చారు. ఇక అమిత్ షాని కలిసొచ్చాక రామచంద్ర యాదవ్ దూకుడుగా ముందుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో పెద్దిరెడ్డిపై పోటీకి చంద్రబాబు అక్కరలేదని, తాను చాలు అని, నెక్స్ట్ పుంగనూరులో పోటీ చేస్తానని చెప్పారు.
అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో కొన్ని రోజుల్లో చెబుతానని అన్నారు. బిజేపి నుంచి బరిలో దిగాలంటే..అక్కడ బిజేపికి బలం లేదు. ఇక టిడిపి మాత్రమే ప్రధాన ఆప్షన్ గా ఉంది. మరి రామచంద్ర యాదవ్ ఏ పార్టీలోకి వెళ్తారో చూడాలి.