మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు..బీజేపీకి హింట్.!

-

అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్‌లు వస్తాయో అర్ధం కాకుండా ఉంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ముఖ్యంగా సీట్ల విషయంలో నేతల మధ్య కుమ్ములాటలు నడుస్తున్నాయి. సిట్టింగులకు సీట్లని కేసీఆర్ చెప్పినా సరే..కొందరు నేతలు వెనక్కి తగ్గడం లేదు..సీటు తమకే అని అంటున్నారు. ఇలా నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తుంటే..తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు సెపరేట్ గా సమావేశం అవ్వడం కలకలం రేపుతోంది.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి…ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు తాజాగా భేటీ అయ్యారు. మైనంపల్లి ఇంట్లో వారు భేటీ అయ్యారు. అయితే మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష వైఖరికి నిరసనగానే వారు కలిశారని తెలుస్తోంది. ముఖ్యంగా ప‌ద‌వులు, అభివృద్ధి విష‌యాల్లో మంత్రి మ‌ల్లారెడ్డి ఒంటెత్తు పోక‌డ‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది ఎమ్మెల్యేల ఆరోప‌ణ‌.

స్థానికంగా త‌మ వాళ్లు ప‌ద‌వులు ఆశిస్తున్నార‌ని, కానీ మ‌ల్లారెడ్డి అన్నీ త‌న నియోజ‌క‌వ‌ర్గానికే తీసుకెళుతున్నార‌నే ఆరోప‌ణ ఆ ఐదుగురు ఎమ్మెల్యేల నుంచి వస్తుంది. తాజాగా మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మార్పుపై ఈ భేటి జరిగిందని సమాచారం. ఇప్పటి వరకూ కుత్బుల్లాపూర్‌కి చెందిన రవి యాదవ్‌ను తప్పించి మేడ్చల్‌కు చెందిన భాస్కర్ యాదవ్‌ను నియమించడంతో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక మల్లారెడ్డి వైఖరిపై త్వ‌ర‌లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు వారు చెప్పారు. ఇది ర‌హ‌స్య భేటీ కాద‌ని, దీనికి ప్రాధాన్యం లేద‌ని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్‌లో తాము అసంతృప్తిగా ఉన్నామ‌నే సందేశాన్ని, సంకేతాల్ని బీజేపీకి పంపిన‌ట్టు తెలుస్తోంది. అంటే తమ డిమాండ్లని గాని పట్టించుకోకపోతే ఎలాంటి నిర్ణయమైన తీసుకునేలా ఉన్నారు. అసలే బీజేపీ ఏమో..ఎవరిని లాగుదామా? అని చూస్తుంది. ఈ క్రమంలో ఐదుగురు ఎమ్మెల్యేల అసంతృప్తిని క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news