గజ్వేల్‌లో గత్తర లేపిన రేవంత్…’కమలం’పై ‘హస్తం’ పైచేయి…

-

తెలంగాణ రాజకీయాల్లో పార్టీల మధ్య హాట్ హాట్ ఫైట్ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు దూకుడు కనబరుస్తూ…అధికార టి‌ఆర్‌ఎస్‌పై విరుచుకుపడుతున్నాయి. వరుసపెట్టి కాంగ్రెస్, బి‌జే‌పిలు తెలంగాణలో భారీ సభలు పెట్టి తమ సత్తా ఏంటో చూపించాయి. ఈ రెండు పార్టీలు అధికార టి‌ఆర్‌ఎస్ టార్గెట్‌గానే రాజకీయం చేస్తున్నాయి. కాకపోతే టి‌ఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామంటే తాము అని కాంగ్రెస్, బి‌జే‌పిలు పోటీ పడుతున్నాయి.congress-party-bjp-party

ఈ పోటీలో భాగంగా తాజాగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్, బి‌జే‌పిలు పోటాపోటిగా భారీ సభలు పెట్టాయి. బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన నిర్మల్‌లో భారీ సభ జరిగింది. ఈ సభకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వచ్చారు. ఇటు సి‌ఎం కే‌సి‌ఆర్ అడ్డా గజ్వేల్‌లో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ విపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే వచ్చారు.

అయితే బి‌జే‌పి, కాంగ్రెస్‌లు తమ సభల్లో కే‌సి‌ఆర్‌నే టార్గెట్ చేసి విమర్శించాయి. ఇక రెండు సభలకు జనం భారీగానే వచ్చారు. కానీ బి‌జే‌పి కంటే కాంగ్రెస్ సభకే భారీగా జనం వచ్చారని తెలుస్తోంది. గజ్వేల్ సభలో భారీ ఎత్తున ప్రజానీకం కనిపించారు. ఇక రేవంత్, ఇతర పార్టీ నాయకులు తమదైన శైలిలో కే‌సి‌ఆర్‌పై విరుచుకుపడ్డారు. అటు బండి…బి‌జే‌పి నాయకులు సైతం అదే పనిచేశారు.

కానీ బి‌జే‌పి కంటే కాంగ్రెస్ సభకు ఎక్కువ మంది జనం రావడమనేది తెలంగాణ రాజకీయాల్లో కాస్త హాట్ టాపిక్ అయింది. అంటే టి‌ఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అనే విధంగా రాజకీయం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. బి‌జే‌పి, కాంగ్రెస్ పార్టీల్లో ప్రజలు కూడా కాంగ్రెస్ వైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా గజ్వేల్‌ సభలో రేవంత్ గత్తర లేపారనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news