కమలంలో సీట్ల పంపకాలు…వారే ఫైనల్?

-

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కుతూ ఉన్నాయి. మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. మళ్ళీ అధికారం దక్కించుకోవడం కోసం టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలు ట్రై చేస్తున్నాయి. మూడు పార్టీలు సైతం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి…అలాగే ఇప్పటినుంచే సీట్లు కూడా ఫిక్స్ చేసుకునే దిశగా వెళుతున్నాయి.

ఇప్పుడే అభ్యర్ధులని ఫిక్స్ చేస్తే ఎన్నికల్లో గెలవడానికి ఛాన్స్ ఉంటుందని పార్టీలు భావిస్తున్నాయి…అందుకే అభ్యర్ధులని ఇప్పటినుంచే ఖరారు చేయడం స్టార్ట్ చేశారు. అయితే అధికారంలోకి దక్కించుకోవడమే టార్గెట్ గా ముందుకెళుతున్న బీజేపీలో సీట్లు ఫిక్స్ చేసేది కేంద్రంలోని పెద్దలు అనే సంగతి అందరికీ తెలిసిందే…రాష్ట్రంలోని నేతలు సిఫార్సులు చేయడం తప్ప సీట్లు ఫిక్స్ చేయడం కష్టం. అదే సమయంలో కేంద్రంలోని పెద్దలు సైతం ఆర్‌ఎస్‌ఎస్ గైడెన్స్ ప్రకారమే ముందుకెళ్ళాల్సిన పరిస్తితి ఉందని సమాచారం.

ఇప్పటికే బండి సంజయ్…సీట్ల విషయం అధిష్టానం చేతుల్లో ఉందని చెప్పేశారు. ఇటీవల గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ఈటల రాజేందర్ చెబుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరికి టికెట్‌ ఇవ్వాలన్నది తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని సంజయ్‌ తెలిపారు. తనతో సహా.. ఏ నాయకుడు కూడా తనకు తాను ఫలానా స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేదని, తాను ఒక స్థానం నుంచి పోటీ చేస్తానని ఒక నాయకుడు తన అభిప్రాయంగా చెప్పవచ్చని, కానీ అదే ఫైనల్‌ కాదని స్పష్టం చేశారు.

అంటే బీజేపీ పార్లమెంటరీ టీం…సీట్లు ఫిక్స్ చేయాలి…అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ గైడెన్స్ బట్టే సీట్లు ఫిక్స్ అవుతాయని తెలుస్తోంది. గతంలో పార్టీలో ముందు నుంచి పనిచేసేవారికి…ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్నవారికి సీట్లు ఎక్కువ దక్కేవి…కానీ ఈ సారి కేసీఆర్ కు చెక్ పెట్టడానికి..ఆ రూల్ కు బ్రేక్ వేసి…ఇతర పార్టీల్లో నుంచి వచ్చే బడా నేతలకు సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news