ఈటలపై ‘కారు’ కూతలు…’నమస్తే’ వద్దంటున్న జనం…

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ని ఓడించడానికి అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ చేయని ప్రయత్నాలు లేవు. ఇంతకాలం టి‌ఆర్‌ఎస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో….తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ముఖ్యంగా హుజూరాబాద్ ప్రజలకు ఇంకా బాగా తెలుసు. ఎన్ని విధాలుగా ఈటలని దెబ్బతీయాలని చూస్తున్నారో అందరికీ క్లారిటీ ఉంది. సరే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనుకుని, ఈటల ప్రతి అంశాన్ని ఎదురుకుంటూ ముందుకెళుతున్నారు. ప్రజల అండ ఉండటంతో ఎక్కడా భయపడకుండా ఈటల ముందుకెళుతూ…టి‌ఆర్‌ఎస్‌కు ఎక్కడకక్కడ చెక్ పెట్టేస్తున్నారు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్
etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

అయినా సరే టి‌ఆర్‌ఎస్ వెనక్కి తగ్గడం లేదు….టి‌ఆర్‌ఎస్ మాత్రమే కాదు…టి‌ఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండే ఓ మీడియా ఏ రకంగా ఈటలని టార్గెట్ చేసిందో కూడా జనాలకు బాగా తెలుసు. ఇక ఆ మీడియా చేసే పని ఒక్కటే…ఎంతసేపు ఈటలపై బురద జల్లడమే…నిజనిజాలు ఏంటి అనేది ఆ మీడియాకు అక్కరలేదు….’కారు’ కూతలు కూస్తూ…ఈటలపై కథనాలు వేస్తూ ఉంటుంది.

తాజాగా కూడా కొన్ని కథనాలు వేసుకుంటూ వచ్చింది….తాజాగా ఒక మహిళా కాంట్రాక్టర్ అయిన శివకుమారి సడన్‌గా బయటకొచ్చి…గతంలో పౌరసరఫరా శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రూ.2 వేల కోట్ల కుంభకోణం చేశారని ఇప్పుడు చెబుతున్నారు. ఎప్పుడో హుద్‌హుద్ తుపాను స‌మ‌యంలో జ‌రిగిన ఘ‌ట‌న‌పై తాపీగా ఇప్పుడు ఫిర్యాదు చేస్తోంది. పైగా తమ కంపెనీ స‌మ‌యానికి కంది పప్పు సప్లై చేయ‌లేద‌ని ఈటల బ్లాక్ లిస్ట్‌లో పెట్టారని తానే చెప్తూ… ఈట‌ల వేరేవారికి టెండ‌ర్లు అప్ప‌గించారని చెప్పింది. అంటే ఇక్కడ తప్పు ఆ కాంట్రాక్టర్‌దే అని తెలుస్తోంది. పైగా ఎప్పుడో జరిగితే ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక ముందు వచ్చి ఈటల కుంభకోణం చేశారని, సి‌బి‌ఐ విచారణ చేయాలని ఇప్పుడు హడావిడి చేస్తుంది.

మరి ఈ హడావిడి ఆమె చేస్తుందో….ఎవరైనా చేయిస్తున్నారో ప్రజలకు బాగా క్లారిటీ ఉంది…పైగా ఆమె హడావిడిని టి‌ఆర్‌ఎస్ అనుకూల మీడియా హైలైట్ చేసింది. ఇదే కాదు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంలో టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం వాటా కూడా ఉంది. దాన్ని హైలైట్ చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పిపై విమర్శలు చేస్తూ, ఈటలని టార్గెట్ చేసి కథనాలు వేస్తుంది. అంటే ఈటలని ఎలాగైనా నెగిటివ్ చేయాలని ఆ మీడియా చేయని ప్రయత్నం లేదు…అందుకే ఆ మీడియాకు జనాలు ‘నమస్తే’ పెట్టేసి….ఆ మీడియా మాకొద్దు బాబోయి అంటున్నారు.