తెలంగాణా బిజేపీ నేతలకు నడ్డా టెన్షన్.. టార్గెట్ రీచ్ అయితే పదవుల్లో ప్రాధాన్యత..

-

తెలంగాణాలో సంస్థాగతంగా బలపడేందుకు బిజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆ పార్టీ భావిస్తోంది.. అందులో భాగంగా.. తెలంగాణా ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవులు కట్టెబెట్టింది.. తద్వారా తెలంగాణాలో బలపడాలని కమలనాధులు స్కెచ్ వేశారు.. కానీ తెలంగాణ బిజేపీ నేతలు మాత్రం.. కేంద్ర నేతలకు ఆశయాలకు మోకాలడ్డుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యంగా ఉండటంపై నడ్డా సీరియస్ అయ్యారట..

దేశ వ్యాప్తంగా బిజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది.. అందులో భాగంగా తెలంగాణాకు 50లక్షల సభ్యత్వాలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు.. దీని కోసం నేతలకు ప్రత్యేక సలహాలు సైతం ఇచ్చారు.. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఆ దిశగా పనిచెయ్యకపోవడంతో డిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారట.. ఇటీవల తెలంగాణాకు వచ్చిన నడ్డా.. దీనిపై రివ్యూ నిర్వహించారు.. ప్రజల మధ్య నేతలు ఉండటంలేదని..తద్వారా సభ్యత్వాల టార్గెట్ ను రీచ్ అవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని కమలం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుంటే.. బిజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే అభ్యర్దులు ఎందుకు స్పందించడంలేదని నడ్డా వారిని ప్రశ్నించారట.. 50లక్షల సభ్యత్వాలు టార్గెట్ పెడితే.. కేవలం 9లక్షలు మాత్రమే చెయ్యడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారట.. మిగిలిన వాటిని పూర్తి చెయ్యాలని.. టార్గెట్ రీచ్ అయిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారని పార్టీవర్గాలు చర్చించుకుంటున్నాయి.. ఒకరిద్దరు నేతలను ఉద్దేశిస్తూ ఆయన.. సీరియస్ గా మాట్లాడారట.. అందరూ కలిసికట్టుగా పనిచేసి.. పార్టీని బలోపేతం చెయ్యాలని ఆదేశించినట్లు కమలనాథులు చెప్పుకుంటున్నారు..

తెలంగాణలో గత ఎన్నికల్లో 71లక్ష ఓట్లు బిజేపీకి పోల్ అయ్యాయి.. వారందరూ బిజేపీ ఓటర్లని..వారిని సభ్యులుగా చేర్చుకోవడంలో నేతలు విఫలమవుతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.. ఎక్కువ సభ్యత్వాలు చేసినవారికి రాబోయే స్తానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని.. జేపీ నడ్డా హామీ ఇవ్వడంతో నేతలు సభ్యత్వాల మీద దృష్టి పెట్టారట.. కొందరు స్పీడ్ గా పనిచేస్తుంటే..మరికొందరు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version