గ్రేటర్లో టఫ్ ఫైట్…‘కారు’ సీట్లు గల్లంతే?

-

రాజకీయాల్లో పోటీ లేకపోతే ఏకపక్ష విజయాలు దక్కుతాయనే చెప్పొచ్చు…అసలు ప్రత్యర్ధులు బలంగా లేకపోతే ఇంకా తిరుగుండదు…అందుకే తెలంగాణలో అసలు ప్రత్యర్ధులే లేకుండా చేయాలని చెప్పి కేసీఆర్ గట్టిగానే ట్రై చేశారు…ఇదే క్రమంలో మొదట టీడీపీని టార్గెట్ చేసి..ఆ పార్టీని అడ్రెస్ లేకుండా చేశారు. చంద్రబాబు పూర్తి ఏపీకే పరిమితమయ్యేలా చేశారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి…ఆ పార్టీని దెబ్బకొట్టారు. ఇలా ప్రతిపక్షాలు వీక్ అవ్వడంతో 2018 ఎన్నికల్లో అదిరిపోయే మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీని ఇంకా దెబ్బకొట్టారు.

దీంతో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదనే పరిస్తితి వచ్చింది..ఇదే సమయంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని టీఆర్ఎస్ కు వరుస షాకులు ఇస్తూ వచ్చింది..రాజకీయంగా టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అనే పరిస్తితికి వచ్చింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా రేసులోకి వచ్చింది…అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది. ఇలా రెండు పార్టీలు పుంజుకోవడంతో కారు పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురు కానుందని అర్ధమవుతుంది.

ఇక ఎక్కువ సీట్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కారు పార్టీకి గట్టి షాకులే తగిలేలా ఉన్నాయి. గ్రేటర్ లో ఎం‌ఐ‌ఎం సీట్లు వదిలేసి…మిగిలిన సీట్లలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది..అటు కాంగ్రెస్ సైతం కొన్ని సీట్లలో టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేలా ఉంది. అయితే గ్రేటర్ లో ప్రధాన పోటీ టీఆర్ఎస్-బీజేపీ మధ్యే ఉండేలా ఉంది.  జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లోనే కారుకు కమలం చుక్కలు చూపించింది.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కారుని నిలువరించడానికి  బీజేపీ గట్టిగానే కష్టపడుతుంది. గ్రేటర్ పరిధిలో సగం పైనే సీట్లు గెలుచుకోవాలనే టార్గెట్ తో కమలం ముందుకెళుతుంది. అటు ఎం‌ఐ‌ఎం పార్టీకి కూడా పోటీ ఇవ్వాలని చూస్తుంది. మొత్తానికి ఈ సారి గ్రేటర్ లో కారుకు డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news