సింగరేణి ఎన్నికల పై టీఆర్ఎస్ ఫోకస్..బీజేపీ యూనియన్ పై గురి

-

ఒక్కో ఎన్నికల్లో టీఆర్ఎస్ కి బీజేపీ షాకిస్తుండటంతో రివర్స్ ఎటాక్ కి సిద్దమైంది గులాబీ దళం. ఏ చిన్న అవకాశన్ని వదులుకోకుడదని ఫిక్సయింది. కోల్ బెల్ట్‌లో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవని భావించిన టీఆర్ఎస్ తమ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేతల పై ఫోకస్ పెట్టింది. రాత్రికి రాత్రే బీజేపీ యూనియన్ నేతతో రాజీనామా చేయించి కొత్త గేమ్ కి తెర తీసింది..

2017లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం విజ‌యం సాధించింది. 11 డివిజ‌న్లకు గాను 9 స్థానాలను కైవ‌సం చేసుకుని ఏక పక్ష విజయాన్ని నమోదు చేసుకుంది. గత ఏడాది ఏప్రిల్ లోనే గడువు ముగియడంతో ఇప్పటికే ఎన్నిక ఆలస్యమయింది. దీంతో ఎన్నికలకు సిద్దమై తిరిగి విజయం సాధించేందుకు టీఆర్ఎస్ ప్యూహాలకు పదును పెడుతుంది. సింగరేణిలో భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ బీఎమ్ ఎస్ కు అధ్యక్షుడిగా ఉన్నారు కెంగర్ల మల్లయ్య. ఏమైందో ఏమో సడెన్‌గా బీఎంఎస్ కు గుడ్‌బై చెప్పారాయన. అంతేకాదు.. సింగరేణిలో యూనియన్లు.. పార్టీల సమీకరణాలు మారబోతున్నాయన్న చర్చ మొదలైంది.

టీఆర్‌ఎస్‌ అనుబంధ సంస్థ అయిన టీబీజీకేఎస్ లో మొదటి నుంచి కొనసాగుతూ వచ్చారు మల్లయ్య. ఆ సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డితో పొసగక బయటకు వెళ్లిపోయారు. అనుచరులతో కలిసి కొద్ది నెలల క్రితం బీఎంఎస్ లో చేరారు. ఇది బీజేపీ అనుబంధ కార్మిక సంఘం. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ఊపు కనిపిస్తుండటంతో బీఎంఎస్ పట్ల కార్మికుల్లోనూ ఆదరణ పెరుగోతోంది. ఇలాంటి తరుణంలో మల్లయ్య గుడ్‌బై చెప్పడం ఆ సంస్థ ప్రతినిధులకు షాక్‌ ఇచ్చినట్టు అయిందట.

కోల్‌ ఇండియాలో జరిగిన మార్పులు కలిసి వస్తాయని బీఎంఎస్ లోని కార్మికలు లెక్కలు వేసుకున్నారట. ఆర్ఎస్ఎస్ నేత, బిఎంఎస్ మాజీ జాతీయ కార్యదర్శి లక్ష్మారెడ్డిని ఆల్‌ ఇండియా కోల్ ఫెడరేషన్ ఇంఛార్జ్‌గా.. కోల్ ఇండియా వేజ్ బోర్డు మెంబర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే ఇదే పదవిపై మల్లయ్య ఆశలు పెట్టుకున్నారట. తనకే ఆ పదవి వస్తుందని ఆశించి ఆయన భంగపడ్డారు. తానొకటి తలిస్తే జాతీయ నాయకత్వం మరొకటి చేయడంతో మల్లయ్య మనసు మార్చుకున్నారని సమాచారం.

అయితే ఆయన ఎప్పటి నుంచో టీఆర్‌ఎస్‌ నేతలతో టచ్‌లో ఉన్నారట. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, మంత్రి ఈటెల రాజేందర్‌తోపాటు పలువురు అధికార పార్టీ నేతలతో నిత్యం మల్లయ్య మాట్లాడుతున్నట్టు బీఎంఎస్ ఆరోపిస్తోంది. టీఆర్‌ఎస్‌ నుంచి ఆయన ఎలాంటి హామీ పొందారు ఆయన పార్టీకి ఏం చెప్పారు అన్నది ఇప్పుడు మిస్టరీగా ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news