కారుకు సీనియర్ల సైలెంట్ షాక్?

-

రాను రాను అధికార టీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ పెరుగుతుందే తప్ప…పాజిటివ్ పెరగడం లేదు. 2014లో గెలిచి తొలిసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ బలం పెరుగుతూనే వచ్చింది…2018 ఎన్నికాలోచ్చేసరికి పార్టీ బలం మరింత పెరిగింది…అందుకు తగ్గట్టుగానే ఆ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి సీన్ మారుతూ వస్తుంది..రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుండగా, టీఆర్ఎస్ బలం తగ్గుతూనే వస్తుంది.

ఇప్పటికీ అదే పరిస్తితి కొనసాగుతుంది…దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కడం అనేది చాలా కష్టమైపోయేలా ఉంది. పైగా ఇప్పటివరకు బలంగా ఉండటంతో బలమైన నేతలు కూడా ఆ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు బలం తగ్గుతుండటంతో..నేతలు తమ దారి తాము చూసుకునేలా ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలు అదే పనిలో ఉన్నారు.  చాలామంది నేతలు టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.

ఇంకా మరికొందరు నేతలు కూడా కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలు సంగతి పక్కన పెడితే…కొందరు బడా బడా నేతలు…బీజేపీ వైపే చూస్తున్నారని తెలుస్తోంది. వీలు చూసుకుని ఆ బడా నేతలు బీజేపీ వైపుకు రావచ్చని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలువురు సీనియర్లతో ఈటల రాజేందర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

పాత పరిచయాలని ఉపయోగించుకుని…బడా నేతలని బీజేపీలోకి లాగే ప్రయత్నాలు ఈటల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో పలువురు సీనియర్లు కేసీఆర్ కు షాక్ ఇచ్చేలా ఉన్నారని సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తీగల కృష్ణా రెడ్డి, కడియం శ్రీహరి, జూపల్లి కృష్ణారావు లాంటి సీనియర్లు టీఆర్ఎస్ పార్టీని వీడటానికే సిద్ధమవుతున్నట్లు సమాచారం…పైగా వీరికి నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ లో సీట్లు దక్కే విషయం డౌటే. అందుకే వీరు ఇప్పుడే సైడ్ అవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎన్నికల సమయంలో వీరి జంపింగ్ ఖాయమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news