కారులో ‘పట్నం’కు సెగ…రేవంత్ లాగుతారా?

-

అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందనే విషయం తెలిసిందే. ఎక్కడకక్కడ నేతల మధ్య వర్గ పోరు నడుస్తోంది..మెజారిటీ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. అయితే ఈ గ్రూపు తగాదాలు అనేవి తమ పార్టీ బలాన్ని నిరూపిస్తున్నాయని మంత్రి కేటీఆర్…పార్టీలో ఉన్న అంతర్గత పోరుని కవర్ చేస్తున్నారు గాని…ఈ పోరు వల్ల పార్టీకి మాత్రం పెద్ద డ్యామేజ్ జరిగేలా ఉంది.

ఇప్పటికే పలుచోట్ల అంతర్గత పోరు వల్ల పార్టీ పరిస్తితి దిగజారుతూ వస్తుంది…అలాగే కొందరు నేతలు పార్టీ కూడా మారిపోయేలా ఉన్నారు. ఇదే క్రమంలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ సైతం టీఆర్ఎస్ ని వీడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో పట్నం ఓడిపోయిన దగ్గర నుంచి ఏదొరకంగా టీఆర్ఎస్ లో ఇబ్బందులే ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే తనపై గెలిచిన రోహిత్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చారో…అప్పటినుంచి పట్నంకు టీఆర్ఎస్ లో సెగ తగలడం మొదలైంది.

పైగా తాండూరులో పట్నం, రోహిత్ వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. అదే సమయంలో నెక్స్ట్ తాండూరు టికెట్ తనదే అని రోహిత్ అంటున్నారు. కాదు తనదే అని పట్నం చెబుతున్నారు. కానీ టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ విషయం తేల్చడం లేదు. ఎన్నికల సమయంలో రోహిత్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని పట్నం వర్గం అనుమానిస్తుంది.

ఈ అనుమానాల మధ్యే పట్నం భార్య…వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిని…వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ వర్గం టార్గెట్ చేసింది. సునీతా కారుపై ఆనంద్ వర్గీయులు దాడి చేశారు…దీనిపై సునీతా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కానీ వరదల నేపథ్యంలో అధిష్టానం వీరి పంచాయితీని పట్టించుకోలేదు..దీంతో సునీతా అసంతృప్తిగా ఉన్నారు. ఓ వైపు పట్నంకు ప్రాధాన్యత ఉండటం లేదు…మరోవైపు సునీతాని అడ్డుకుంటున్నారు. ఇలా టీఆర్ఎస్ లో పట్నం ఫ్యామిలీకి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇదే క్రమంలో పట్నం మహేందర్ రెడ్డితో రేవంత్ టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం…కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది..అలాగే పట్నం ఫ్యామిలీకి రెండు సీట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. కానీ పట్నం సోదరుడు నరేందర్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కొడంగల్ సీటు మాత్రం ఇచ్చేది లేదని రేవంత్ తేల్చి చెప్పారట. దీంతో ఇక్కడే కాస్త పట్నం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. పైకి ఏమో టీఆర్ఎస్ వీడటం లేదని చెబుతున్నారు గాని..బ్యాగ్రౌండ్ లో తన ప్రయత్నాలు తాను చేస్తున్నారట. మరి చూడాలి పట్నం ఫ్యామిలీ టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news