ట్విటర్ పోల్ : జ‌గ‌న్ 2.0 ఎలా ఉంటాడంటే ?

-

ఈ ఉగాది నుంచి అంటే ఏప్రిల్ రెండు నుంచి అంటే ఈ శ‌నివారం నుంచి పాల‌న‌లో కొత్త మార్పులు రానున్నాయి అని యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెబుతున్నారు.ఇందుకోసం పాల‌నాప‌ర సంస్క‌ర‌ణ‌లు కూడా తీసుకురానున్నామ‌ని అంటున్నారు. ఈ ద‌శ‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైఎస్సార్సీపీ కార్యక్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్నారు. ఇందులో భాగంగా ఎంపీలూ మ‌రియు ఎమ్మెల్యేలూ భాగం కానున్నారు. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో త‌మ ప్ర‌భుత్వం ప‌నితీరు ఎలా ఉందో కూడా తెలుసుకోనున్నారు.

క్షేత్ర స్థాయిలో పాల‌న‌లో సంస్క‌ర‌ణ‌లే కాదు మంత్రుల ప‌నితీరులో కూడా మార్పులు రావాల‌ని జ‌గ‌న్ ఆశిస్తున్నా కానీ రిజ‌ల్ట్ మ‌రోలా ఉంది. ఎవ్వ‌రూ కూడా జ‌నంలో లేరు. జ‌నం లో లేని వారంతా మ‌ళ్లీ ఎమ్మెల్యేలు కాలేరు. అందుకే ప‌రిపాల‌న‌కు సంబంధించి ప‌లు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేదు. ఇది గ్ర‌హించిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లోనే మంత్రుల‌ను మార్చ‌నున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను మార్చ‌నున్నారు. అదేవిధంగా చాలా మార్పులు తీసుకురానున్నారు.

ఉగాది నుంచి ఎమ్మెల్యేలు ఎండ‌ల్లో తిర‌గాలి. ఉగాది నుంచి ప్ర‌జా క్షేత్రంలో ఉండాలి. ప‌ని చేస్తే స‌రేస‌రి ! కానీ ఇంటికే పరిమితం అయితే వాళ్ల‌కు ఇక టికెట్ రాద‌నే తేలిపోయింది. కానీ జ‌గ‌న్ కోరుకున్న విధంగా మార్పులు రావ‌డం అంటే అంత సులువు కాదు. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ప‌నులు జ‌ర‌గాలంటే నిధులు కావాలి. డ‌బ్బులుంటే సంక్షేమానికి వెచ్చించి త‌రువాత సైలెంట్ అయిపోతున్నారు. క‌నుక ఈ ద‌శ‌లో బాగా కృషి చేసి మంచి ఫ‌లితాలు అందుకోవ‌డం అంటే అంత సులువు కాదు. క‌నుక జ‌గ‌న్.. త‌ర‌ఫున కూడా సాయం కావాలి అని కోరుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధికి రెండు కోట్ల రూపాయ‌ల చొప్పున నిధులు విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. ఆ మొత్తం విడుద‌ల చేసినా కూడా వెంటవెంట‌నే ప‌నులు
చేప‌ట్ట‌డం అన్న‌ది కుద‌ర‌దు ఎందుకంటే ఇంత‌కాలం ప్ర‌భుత్వం త‌మ‌కు పాత బ‌కాయిలు చెల్లించ‌కుండా ఇబ్బంది పెడుతున్న వైనంతో విసిగి ఉన్న కాంట్రాక్ట‌ర్లు అందుకు అడ్డం ప‌డ‌తారు. అప్పుడు ప‌నులు మొద‌లుకావు.ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకుని పాల‌న ప‌రంగా మార్పులు చేయాల్సి ఉంది. ఇదే అంశం పై ఇవాళ్టి ట్విట‌ర్ పోల్…

– ట్విట‌ర్ పోల్ – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version