50 వేల మెజారిటీ పక్కా..ఉత్తమ్ కాన్ఫిడెన్స్ ఏంటి?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాస్త గడ్డు పరిస్తితి ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. సంస్థాగతంగా బలం ఉన్నా సరే..సొంత పోరుతో ఇబ్బందులు పడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఈ రచ్చ వల్ల..అటు బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. అయితే పార్టీని ఎలాగోలా గాడిలో పెట్టాలని చెప్పి టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. అలాగే మిగతా నేతలు కూడా తమ తమ స్థానాల్లో పాదయాత్ర చేయాలని చూస్తున్నారు. ఇలా నేతలు తమ స్థానాలపై ఫోకస్ పెట్టారు.

ఇదే సమయంలో మాజీ టి‌పి‌సి‌సి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తమ సొంత స్థానంపై ఫోకస్ పెట్టారు. కోదాడ, హుజూర్‌నగర్ స్థానాలపై ఫోకస్ పెట్టి పనిచేతున్నారు. కోదాడలో తన భార్య పద్మావతి, హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ పోటీ చేయాలని చూస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో 50 వేల ఓట్లపైనే మెజారిటీతో గెలుస్తామని, ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ సవాల్ చేస్తున్నారు. అయితే రెండు నియోజకవర్గాలు ఉత్తమ్ ఫ్యామిలీ కంచుకోటలే.

కాకపోతే గత ఎన్నికల్లో కోదాడ నుంచి స్వల్ప మెజారిటీ తేడాతో పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు. కానీ హుజూర్‌నగర్ నుంచి గెలిచారు. కాకపోతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది..దీంతో హుజూర్‌నగర్ ఉపఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతి పోటీ చేశారు. విజయం సైదిరెడ్డిని వరించింది.

అలా సొంత స్థానాన్ని ఉత్తమ్ కోల్పోయారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో అక్కడ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అటు సైదిరెడ్డి ఏమో..కేటీఆర్‌ని తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు. అయినా సరే హుజూర్‌నగర్‌లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ఉత్తమ్ సవాల్ చేస్తున్నారు. మరి చూడాలి ఉత్తమ్ ఛాలెంజ్‌ నెగ్గుతారో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version