రసవత్తరంగా మారిన విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న పార్టీలు..

-

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది.. ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.. వైసీపీకి ఆధిక్యమున్న విశాఖ గ్రేటర్ మున్సిపాల్టీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది.. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచేందుకు పావులు కదుపుతొంది.. అధికార పార్టీ వ్యూహాలను ముందుగానే గుర్తించి.. పర్పెక్ట్ ప్లాన్ తో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. వైసీపీ తరపున బొత్స బరిలో ఉండగా.. ఆయన్ని ధీటుగా ఎదుర్కోనేందుకు కూటమి తరపున పీలా గోవింద సత్యనారాయణను ఆ పార్టీ అధిష్టానం పైట్ ను దింపింది.

ఎమ్మెల్సీ ఎన్నికను వైసీపీ అధినేత, మాజీ సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. అందులో భాగంగానే అభ్యర్ది ఎంపిక దగ్గర నుంచి నేరుగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు.. సీనియర్ నేతగా.. విశాఖ జిల్లాలో సుపరిచితులుగా ఉన్న బొత్సను రంగంలోకి దింపారు మాజీ సీఎం జగన్.. సంఖ్యా బలాన్ని బట్టి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి విజయం వరించాలి.. కానీ కూటమి అధికారంలో ఉండటంతో .. కొందరు ప్రజాప్రతినిధులు టీడీపీకి టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.. ఈ నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమైందట.. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను క్యాంపుకు తరలించాలని నిర్ణయించుకుంటున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యారు.. ఎన్నిక ప్రాధాన్యతను వివరించడంతో పాటు.. తనకు అండగా ఉండాలని.. బొత్సను గెలిపించాలని ఆయన విజ్ణప్తి చేశారు. టీడీపీ చేసే కుట్రలను తట్టుకుని పార్టీకి తోడుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.. విశాఖ జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో వైసీపీ 600కి పైగా స్థానాల్లో గెలిచింది.. టీడీపీ కేవలం 200 పైచిలుకు స్థానాలకే పరిమితమైంది.. ఈ క్రమంలో ఈ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం ఉమ్మడి విశాఖజిల్లాలో జరుగుతోంది.. తమ ప్రజాప్రతినిధులను క్యాంపు తరలించాలని వైసీపీ భావిస్తుంటే.. వారిని కట్టడి చేసే తమవైపు తిప్పుకోవాలని టీడీపీ భావిస్తోంది.. మొత్తంగా ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version