సీఎం రేవంత్ రెడ్డికి క్లోజ్ గా ఉన్న అధికారి బదిలీ వెనుక అంతర్యం ఏంటి..??

-

హైదరాబాద్ కమీషనర్ గా పనిచేస్తున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సడన్గా బదిలీ అయ్యారు.. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా, సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఆయన బదిలీ అవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది.. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో క్రేజ్ ఉండే పోస్ట్ ఇది. హైదరాబాద్ సిటిలో నిత్యం వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ ని కూడా నిత్యం పరివేక్షించాల్సి ఉంటుంది.. మీడియా ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది..అలాంటి క్రేజీ పోస్టుని కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి దక్కించుకున్నారు..

ఉమ్మడి మహబూబ్నగర్ ఎస్పీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పని చేస్తున్న సమయంలోనే రేవంత్ రెడ్డి తో మంచి సంబంధాలు ఉన్నాయి.. నిజాయితీ సమర్థత కలిగిన అధికారిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది .. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ఆయన్ని సిపిగా రేవంత్ రెడ్డి ఏరికోరి తెచ్చుకున్నారు. సిటీ పోలీస్ వింగ్ లో ఎక్కడా పనిచేసిన అనుభవం లేకపోయినా… సీఎం రేవంత్ తో ఉన్న అనుబంధం కారణంగా ఆయన సిపిగా వచ్చారని ప్రచారం జరిగింది..అయితే బాధ్యతలు చేపట్టిన ఏడాది లోపే కొత్తకోట బదిలీ అయ్యారు.. ఆయన బదిలీ వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయని పొలిటికల్ గా చర్చ నడుస్తుంది..

హైదరాబాద్ సిటీ పైన పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, కింది స్థాయి సిబ్బందితో సఖ్యతగా ఉండకపోవడం వంటి కారణాలతోపాటు, చిన్నచిన్న తప్పులకు పెద్ద పనిష్మెంట్లు వస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి పైన ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయట.. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఆయన్ని పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతుంది.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా.. పెద్దగా స్పందించే వారు కాదని, అది కూడా ఒక కారణమని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. సో మొత్తానికి హైదరాబాద్ సీపీగా పనిచేస్తున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బదిలీ వెనక ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట..

Read more RELATED
Recommended to you

Exit mobile version