వావ్ : సాక్షి ఎడిట‌ర్ మాట‌ను నిజం చేసిన జ‌గ‌న్ ..ఎలా అంటే ?

-

సాక్షి దిన‌ప‌త్రిక ఆరంభంలో కాక‌ర్ల పూడి నార‌సింహ యోగ ప‌తంజ‌లి అనే పెద్దాయ‌న‌ను ఎడిట‌ర్ గా తీసుకున్నారు జ‌గ‌న్. అప్ప‌టికి ఆయ‌న ఏ గండాలూ లేని రోజుల్లో ఉన్నారు. ప్ర‌తిరోజూ ప‌త్రిక ను కొత్త‌గా ఏ విధంగా తీసుకుని రావాలో అన్న ఆలోచ‌న‌లో ఉన్నారు జ‌గ‌న్. ఉద‌యం,సాయంత్రం అని తేడా లేకుండా ఎడిటోరియ‌ల్ టీంతో మాట్లాడేవారు జ‌గ‌న్. అప్పుడు కార్మెల్ పాయింట్ (బంజారా హిల్స్ రోడ్ నంబ‌ర్ 12) కు రోజూ వ‌చ్చి పోయేవారు.
ఆ బిల్డింగ్ లోనే సాక్షి సెంట్ర‌ల్ ఆఫీసు ఆరంభం. ఓ విధంగా వైఎస్సార్ కుటుంబానికి బాగా సెంటిమెంట్ ప్లేస్ అది. అక్క‌డి నుంచి జ‌గ‌న్ త‌న ప్ర‌యాణం ప్రారంభించారు. అప్ప‌టికి ఆయ‌న పెద్ద‌గా ఎవ్వ‌రికీ తెలియ‌దు. ఆఫీసుకు వ‌చ్చినా కూడా త‌న ప‌నేంటో అన్న విధంగా ఉండేవారు త‌ప్ప పెద్ద‌గా అరిచి గోల చేయ‌డం లాంటివి కూడా లేవు.

ఓ సంద‌ర్భంలో ఎడిటోరియ‌ల్ టీంతో మాట్లాడుతూ ప‌తంజ‌లి స‌ర్ తో ఓ మాట చెప్పారు. అన్నా ! ఎడిట్ పేజ్ తీసేయండి అని..ఆ మాట విన్నాక అంతెత్తు లేచారు ప‌తంజ‌లి. ఆ రోజు జ‌గ‌న్ ను బాగా తిట్టార‌ని కూడా అప్ప‌ట్లో ఆ స‌మావేశంలో ఉన్న వారు చెబుతారు.త‌రువాత కాలంలో ప‌తంజ‌లి చ‌నిపోయారు. సీన్లోకి వ‌ర్థెల్లి ముర‌ళి వ‌చ్చారు.

అంత వ‌ర‌కూ ఉన్న ఈడీ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స్థాయికి ఎదిగిపోయారు. ఏదేమ‌యినా ప‌తంజ‌లి రాసిన వాక్యం ఒక‌టి గుర్తుకువ‌స్తోందీ వేళ..బాగా తియ్య‌గా ఉండ‌కు న‌మిలి ఊసేస్తారు అని! అదే మాట ఇప్పుడు ఏపీ మంత్రుల విష‌య‌మై నిజం అవుతోంది.
వీర విధేయుల‌కూ, అతి వినయం న‌టించిన వాళ్ల‌కూ, జ‌గ‌న్ అంటే ప్రాణం ఇచ్చేస్తాం, జ‌గ‌న్ చెబితే గొంతు కోసుకుంటాం లాంటి అతి మాట‌లు చెప్పిన వాళ్లంద‌రికీ ఉద్వాస‌నలు త‌ప్ప‌వ‌ని తేలిపోయాయి. పాపం లాస్ట్ డే.. ఈ రోజు మా లేదా మ‌న దాస‌న్న ఏమౌతాడో..లేదా ఏమ‌యిపోతాడో.. మా లేదా మ‌న పేర్ని నాని ఏమౌతాడో లేదా ఏమ‌యిపోతాడో.. అని జ‌న‌సేన జోకులు వేస్తోంది. టీడీపీ కూడా జోకులు వేస్తున్న‌ది.
– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Exit mobile version