మునుగోడు మినీ వార్: షర్మిల ఎటు?

-

మునుగోడు ఉపఎన్నిక పోరు మొదలైంది…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా…రాజీనామాని స్పీకర్ కు ఇచ్చి…ఆమోదింపజేసుకున్నారు..దీంతో మునుగోడు మినీ యుద్ధం మొదలిపోయింది. ఈ యుద్ధంలో పైచేయి సాధించడానికి ఎవరికి వారే సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఎలాగైనా మునుగోడులో గెలిచి తమ బలం తగ్గలేదని అధికార టీఆర్ఎస్ నిరూపించుకోవాలని చూస్తుంది. ఇక తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. కోమటిరెడ్డి రాకతో బలపడిన బీజేపీ…హుజూరాబాద్ మాదిరిగా మునుగోడులో గెలిచి తమ సత్తా ఏంటో చూపించుకోవాలని చూస్తుంది.

అయితే ఇప్పటికే ఎవరికి వారు సెపరేట్ వ్యూహాలతో రాజకీయం మొదలుపెట్టారు. ప్రజలని ఆకర్షించేందుకు టీఆర్ఎస్..మునుగోడుకు వరాలు అందిస్తుంది. అలాగే మునుగోడులో బలంగా ఉన్న కమ్యూనిస్టుల మద్ధతు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అటు కాంగ్రెస్ సైతం…తమ క్యాడర్ ని రాజగోపాల్ తో పాటు బీజేపీలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది…అలాగే ఇక్కడ బీసీ అభ్యర్ధిని పెట్టి..బీసీ ఓట్లని ఆకర్షించాలని చూస్తుంది. కాంగ్రెస్ సైతం..కమ్యూనిస్టుల మద్ధతు కోసం చూస్తుంది.

ఇక బీజేపీ..కేవలం రాజగోపాల్ బలం, టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లపైనే ఆధారపడి ఉంది. ఇలా ఎవరికి వారికి గెలవడం కోసం సెపరేట్ బలాలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణలో ఉన్న షర్మిల పార్టీ…ఇంతవరకు ఎక్కడ పోటీ చేయలేదు. అలాగే మునుగోడులో కూడా పోటీ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే షర్మిల పార్టీకి పెద్ద బలం లేదు. కాకపోతే ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో షర్మిల పార్టీ కాస్త ప్రభావం చూపవచ్చు అని తేలింది.

అది కూడా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉందని సర్వేల్లో తేలింది. అయితే మునుగోడులో కొంతవరకు వైఎస్సార్ అభిమానులు ఉన్నారు…కానీ అదే వైఎస్సార్ ని అభిమానించే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే షర్మిల మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ మధ్య షర్మిల మునుగోడులో దీక్ష చేస్తే…రాజగోపాల్ పనికట్టుకుని…ఆమెకు ఫోన్ చేసి మద్ధతు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మునుగోడులో షర్మిల మద్ధతు రాజగోపాల్ కే ఉండే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news