వాట్సాప్ లో ‘ పోల్ ‘ ఫీచర్..ఎలా ఉపయోగించాలంటే?

-

సోషల్ మీడియా మెసెంజర్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ ను అందిస్తూ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్‌గా పేరు తెచ్చుకున్న వాట్సాప్‌ క్రమంగా యూజర్లను పెంచుకుంటూ పోతోంది. యూజర్లను పెంచుకునే క్రమంలో వాట్సాప్‌ రోజుకో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది..

ఇలా తీసుకొచ్చిన ఫీచర్లలో వాట్సాప్‌ పోల్‌ ఒకటి. ఇప్పటికే చాలా మంది యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలి..ఎటువంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…

పోల్స్‌ నిర్వహించడానికి ప్రత్యేకంగా యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయి. అయితే వాట్సాప్‌లోనే ఇన్‌బిల్ట్‌గా ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. వాట్సాప్‌ పోల్‌ ఫీచర్‌లో భాగంగా ఒక ప్రశ్నను సంధించి దానికి 12 వరకు ఆప్షన్స్‌ ఇచ్చే సౌలభ్యాన్ని వాట్సాప్‌ కల్పించింది. ఒకే ఆప్షన్‌ను రెండుసార్లు ఇస్తే తీసుకోదు. ఇది వరకు ఈ ఫీచర్‌ ట్విట్టర్‌లో ఉండేది. యూజర్లు తమకు నచ్చిన భాషలో పోల్‌ను నిర్వహించవచ్చు. వాట్సాప్‌ గ్రూప్స్‌లో సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌తో పనిచేసే ఈ ఫోన్‌లలో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది..

ఎలా ఉపయోగించాలంటే?

*. ముందుగా వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి మీరు పోల్‌ క్రియేట్ చేయాలనుకుంటున్న పర్సనల్ చాట్‌ లేదా గ్రూప్‌ను ఓపెన్‌ చేయాలి.
* అనంతరం చాట్‌ బాక్స్‌ పక్కన ఉండే ‘అటాచ్‌మెంట్’ సింబల్‌ను క్లిక్‌ చేయాలి.
* వెంటనే డాక్యుమెంట్, కెమెరా, గ్యాలరీతో పాటు చివరల్లో కొత్తగా యాడ్‌ చేసిన ‘పోల్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది.
* పోల్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయగానే ‘ఆస్క్‌ క్వశ్చన్‌’తో పాటు కింద ఆప్షన్స్‌ కనిపిస్తాయి.
* ‘ఆస్క్‌ క్వశ్చన్‌’లో మీరు అడగాల్సిన ప్రశ్నను ఎంటర్‌ చేసి కింద దానికి ఆప్షన్స్‌ ఇవ్వాలి.
* తర్వాత సెండ్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే వెంటనే మీరు కోరుకున్న వ్యక్తికి ఆ పోల్‌ వెళుతుంది.
* పోల్‌ను రిసీవ్‌ చేసుకున్న వారికి ప్రశ్నతో పాటు ఆప్షన్స్‌ కనిపిస్తాయి.
* ఓట్లు వేసిన తర్వాత కింద ‘వ్యూ ఓట్స్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఏ ఆప్షన్‌కు ఎన్ని ఓట్లు పడ్డాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది..ఇంకా ఫ్యూచర్ లో మరిన్ని ఫీచర్స్ లను అందుబాటులోకి తీసుకొని రానున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news