తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం..చరిత్రలోనే ఇదే తెలిసారి

-

తెలంగాణలో మళ్ళీ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ఇవాళ సాయంత్రం 3.54 నిమిషాలకు ఏకంగా 13857 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇలా చోటు చేసు కోవడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే అత్యధిక విద్యుత్ వినియోగంగా నమోదు అయింది.

3 రోజుల క్రితం 13742 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా ఇవాళ 13857 మెగా వాట్లు నమోదు అయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం, పరిశ్రమల స్థాపన, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోనే విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఒకటి, రెండు రోజుల్లోనే 14000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ రావచ్చు అంటున్నారు విద్యుత్ అధికారులు. అలాగే విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని చెబుతున్నారు.

ఇది ఇలా ఉండగా కరెంట్‌ సమస్యలపై తెలంగాణ విద్యుత్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ ని ప్రారంభించారు ఈ ఆర్సీ ఛైర్మెన్ శ్రీ రంగ రావు. ఈ సందర్భంగా ఈ ఆర్సీ ఛైర్మెన్ శ్రీ రంగ రావు మాట్లాడుతూ….వినియోగదారుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ రూపొందించామని.. ఆన్లైన్ ద్వారా విద్యుత్ వినియోగదారులు కంప్లైట్ చేయొచ్చు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version