తెలంగాణలో విద్యుత్ కోతలు ..కాంగ్రెస్ ట్వీట్

-

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ,ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉంటాయని బీఆర్ఎస్ పార్టీ తరచు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక టిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది.

తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ తీగలకు ఆనుకుని ఉండే చెట్ల కొమ్మలను తొలగించేందుకు, స్తంభాల మెయింటెనెన్స్ కోసం మాత్రమే విద్యుత్ నిలిపివేస్తున్నాం తప్ప కోతలు ఎక్కడా లేవు అని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అనవసరంగా విద్యుత్ నిలిపివేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో టిఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version