ప్రభాస్ సందీప్ రెడ్డి సినిమాకు అదిరిపోయే టైటిల్..?

-

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. అయితే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు “స్పిరిట్” అనే టైటిల్ ను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమా తో సూపర్ హిట్ అందుకోగా ప్రస్తుతం బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్… ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ సినిమా షురూ కానుంది. ఆ చిత్రం తర్వాత ప్రభాస్-25 పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version