రూ.342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం.. ఎలా అంటే..?

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. అలానే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ అతి తక్కువ డబ్బుతో బీమా సౌకర్యాన్ని ఇస్తోంది. ఈ మధ్య బీమాపై ప్రజలకు అవగాహన పెరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి బీమాను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం కూడా అనుకుంటోంది.

ఇక ఇది ఇలా ఉంటే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పధకాలు బాగా ఉపయోగ పడతాయి. దీనితో రూ.4 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందొచ్చు. దీనిని పొందాలి అంటే రూ.342 చెల్లించాల్సి ఉంటుంది.

మరి పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదంలో బీమా పొందిన వ్యక్తి మరణించినా లేదా పూర్తిగా వికలాంగుడైనా.. అప్పుడు రెండు లక్షలు వస్తాయి. ఈ పథకం కింద బీమా చేయబడిన వ్యక్తి పాక్షికంగా లేదా శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే అతనికి రూ. 1 లక్ష వస్తాయి. ఈ స్కీమ్ కి 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అర్హులు.

ఇది ఇలా ఉంటే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ. 2 లక్షలు వస్తాయి. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వాళ్ళు దీనికి అర్హులు. ఈ పథకం కోసం మీరు కేవలం రూ. 330 వార్షిక ప్రీమియం చెల్లిస్తే చాలు. ఈ బీమా క‌వ‌ర్ జూన్ 1 నుంచి మే 31 వ‌ర‌కు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version