బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ప్రజెంట్ క్రేజీ హీరోయిన్ అయిపోయింది. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన ‘అఖండ’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ భామ.. అందులో చక్కటి నటన కనబరిచి ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.
ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకునే ఈ భామ.. తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేసింది. వేసవి కాలం కావడంతో అసలే ఎండలు మండిపోతుంటే తన ఫొటోలతో నెట్టింట మరింత హీట్ పెంచేసింది ఈ సుందరి.
ఫ్యాషన్ మ్యాగజైన ‘ఐ దివా’ కోసం ఫొటోషూట్ చేయగా, అందులో పాల్గొంది ఈ అమ్మడు. సూపర్ హాట్ అండ్ సెక్సీ్ ఫోజులు ఇచ్చింది. ఆ ఫొటోలను ఇన్ స్టా వేదికగా పంచుకోగా అవి చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు సంప్రదాయ బద్ధమైన బట్టల్లో కనిపించిన ప్రగ్యా ఒక్కసారిగా ఇలా స్కిన్ షో చేయడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చిన్న గౌనును ధరించి అలా సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న ప్రగ్యా జైస్వాల్ ను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ‘వావ్, బ్యూటిఫుల్, లవ్ యూ, సూపర్బ్’ అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య చిత్రం ‘అఖండ’ ప్రగ్యా జైస్వాల్ ఐఏఎస్ అధికారిణిగా కనిపించగా, అందులో చక్కటి నటన కనబరిచింది.